చదువులతో పాటు క్రీడలలోనూ రాణించాలి - ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ఐ టి ఐ కళాశాల, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరి
చదువులతో పాటు క్రీడలలోనూ రాణించాలి
ఐ టి ఐ కళాశాల, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరి
-ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి డిసెంబర్ 10:
విద్యార్థులు కేవలం చదువులకే పరిమితం కాకుండా, క్రీడల లోనూ రాణించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు
నిర్వహిస్తున్న సిఎం కప్ సందర్భంగా
ధర్మపురి క్షేత్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని, క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...క్రీడలు శారీరిక మానసిక ఆరోగ్యం సమకూరుస్తాయని, పోటీల ద్వారా పిల్లలలో నైపుణ్యాలు బహిర్గతం కాగలవని అన్నారు.
గత ప్రభుత్వం క్రీడల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం చూపిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, చాలా ఏళ్లుగా పిఈటీ లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని పిడీలుగా పదోన్నతులు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ర్ట ప్రభుత్వం కల్పించిందని, తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఐ టి ఐ కళాశాల, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరి చేయించానని, మంత్రి శ్రీధర్ బాబుతో కలసి త్వరలో భూమి పూజ చేస్తామని, నియోజకవర్గంలో విద్యార్థులకు
క్రీడలు, విద్యకు సంబంధించిన విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని, ఎప్పుడైనా విద్యార్థులకు బోజన సదుపాయం అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉపాద్యాయులు విద్యార్ధులను తమ స్వంత పిల్లలుగా భావించి, విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. 430 మంది విద్యార్థులు 14రకాల పోటీలలో తమ నైపుణ్యాలను ప్రదర్శించ నున్నారు.
మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పత్తి రవీందర్ అధ్యక్షతన, మండల విద్యాధికారిణి సందెంభట్ల
సీతాలక్ష్మి నిర్వహణలో జరిగిన సమావేశంలో తహాశీల్ దార్ కృష్ణ చైతన్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపిఒ నరేష్, కౌన్సిలర్లు వేముల
నాగలక్ష్మి, జక్కు పద్మ, గరిగే అరుణ, ఒడ్నాల ఉమాలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు మహేందర్, శ్రీనివాస్ వేదికాసీనులు కాగా, ఉపాద్యాయులు గొల్లపెల్లి గణేశ్ నిర్వహించగా పలు పాఠశాలల ఉపాద్యాయులు, విద్యార్థులు క్రీడాకారులుగా పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ క్రీడా జ్యోతి ప్రజ్వలన గావించి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించి, క్రీడా పోటీలను ప్రారంభించారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, మూడు రోజులకు గాను స్వయంగా భోజన వసతి కల్పించే ఏర్పాట్లు చేశారు.