పూలే హాస్టల్ సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నిరోధించిన పోలిసులు 

On
పూలే హాస్టల్ సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నిరోధించిన పోలిసులు 

పూలే హాస్టల్ సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను నిరోధించిన పోలిసులు 

గొల్లపల్లి డిసంబర్ 05 (ప్రజా మంటలు):

గొల్లపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతి రావు పూలే హాస్టల్ సందర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత ను హాస్టల్లోకి  పోలీసులు అనుమతించలేదు.
హాస్టల్ మెన్ గేట్ కు తాళాలు వేసిన సిబ్బంది. 
మాజీ కొప్పుల ఈశ్వర్ మంత్రి చూడగానే విద్యార్థులు గేట్ దగ్గరకు వచ్చారు.
ఈ సందర్భంగా గేట్ బయటనుండి విద్యార్థుల బాగోగులు తెలుసుకోడానికి వచ్చామనీ కొప్పుల అన్నారు.
కాంగ్రెస్ పాలనలో గురుకుల పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నాయన్నారు..!
గురుకుల పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేకున్నా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు సందర్శనకు వచ్చిన అన్ని బాగానే ఉన్నాయని మీ ద్వారా చెప్పించడం జరుగుతుందనీ విద్యార్థులు తెలిపారు.

అలా కాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెబితే జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కెసిఆర్ పాలనలో గురుకులు విజయవంతంగా నిర్వహించి విద్యార్థుల్లో విశ్వాసం పెంచారు.. కాని కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యార్థుల తల్లిదండ్రుల కు గురుకులాలపై విశ్వాసం సన్నగిల్లిందని, విద్యార్థులకు వివరించారు.

Tags