ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత - ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

On
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత - ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత - ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ నవంబర్ 30:

ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌త క్రమాన్ని ఎంచుకోవాల‌ని చెప్పారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , సలహాదారు వేం నరేందర్ రెడ్డి లతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు.

తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌త ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయాలి.

అందుకోసం అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఇందిరమ్మ యాప్‌లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలి.

ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించి ప్ర‌త్యేక కోటా ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి.

లబ్దిదారులు ఎవరైనా ఇందిర‌మ్మ ఇళ్ల‌కు అద‌నంగా గ‌దులు నిర్మించుకోవాలని ఆస‌క్తి చూపితే అందుకు అవ‌కాశం క‌ల్పించాలి.

ఈ ప‌థ‌కం స‌మ‌ర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవ‌స‌ర‌మైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలి.

Tags