సంగారెడ్డిలో దీక్షా దివస్ సంబురాలు.

On
సంగారెడ్డిలో దీక్షా దివస్ సంబురాలు.

సంగారెడ్డిలో దీక్షా దివస్ సంబురాలు

కంది నవంబర్ 29:

సంగారెడ్డి కంది బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ జిల్లా ఇంచార్జి దేవి ప్రసాద్ రావు సమక్షంలో వైభంగా దీక్షా దివస్ వేడుకలు నిర్వహించారు.

సంగారెడ్డి పట్టణం లో గులాబీ బైండింగ్ లతో, దీక్షా దివస్ ఫ్లెక్సీ లతో, పార్టీ జెండాలతో సంగారెడ్డి పట్టణం గులాబీ మాయం అయింది.

ముందుగా ఐబీ అమరవీరుల స్థూపానికి పూలు వేసి నివాళి అర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి  ఎమ్మెల్యే చింత ప్రభాకర్, దేవి ప్రసాద్ రావు పూలమాలు వేశారు.

ఉద్యమం రోజునాటి కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఉద్యమ కాలం నాటి చిత్రాలను ప్రదర్శించారు.

అనంతరం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగరావేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు వేసి,  ఉద్యమ నాయకుడు కెసిఆర్ గారి చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలసి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు, దేవి ప్రసాద్ రావు,  మాజీ ఎమ్మెల్యే లు చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిపాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు మాట్లాడుతూ,తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు" తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో" అన్న నినాదంతో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమ నాయకుడు కేసీఆర్  ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు,కేసీఆర్ గారి చారిత్రాత్మక దీక్షకు నేటికి 15 ఏండ్లు పూర్తి అయిందని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సదాశివపేటకు చెందిన కృష్ణ ,శంకర్ పోలీసుల కాల్పుల్లో మరణించారని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అబ్బదాల మీద పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.

దేవి ప్రసాద్ రావు గారు మాట్లాడుతూ,రాదు అనుకున్న తెలంగాణను సాధించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందను అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కెసిఆర్ నామరూపాలు లేకుండా చేస్తాం, కెసిఆర్ పేరు లేకుండ చేస్తాం అని కలలు కంటున్నారు.

తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కెసిఆర్ చరిత్రను ఎవరు చేరపలేరు...రేవంత్ కు పాలనపై... సోయిలేదు అన్ని వర్గాల ప్రజలను గ్యారంటీ లతో మోసం చేశారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంవత్సరం లోనే వ్యతిరేకత మొదలైంది.. కెసిఆర్ గారి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో జిల్లాలో గులాబీ జెండా ఎగరావేయాలన్నారు.

Tags