మల్లన్న పేటలో భక్తులకు  ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలి

 - డీఎస్పీ రఘు చందర్

On
మల్లన్న పేటలో భక్తులకు  ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలి

మల్లన్న పేటలో భక్తులకు  ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పాటించాలి

 - డీఎస్పీ రఘు చందర్ 

గొల్లపల్లి నవంబర్ 29 ప్రజా మంటలు
 
గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర ఉత్సవాలు డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న సందర్భంగా శుక్రవారం జగిత్యాల డిఎస్పి డి.రఘు చందర్ మల్లన్న పేట గుడిని సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల గురించి మరియు ఎటువంటి దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి పార్కింగ్ స్థలాలను  వాటి ఏర్పాటుకు  తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

డీఎస్పీ వెంట ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి, గొల్లపల్లి ఎస్సై సిహెచ్ సతీష్, బుగ్గారం ఎస్ఐ మడా శ్రీధర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్, ఆలయ ఇఓ విక్రమ్ గౌడ్ ఆలయ కమిటీ ట్రస్టీ శాంతయ్య సిద్దంకి మల్లా రెడ్డి ,మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Tags