పవిత్రమైన రామాయణాన్ని మహర్షి వాల్మీకి ప్రపంచానికి వరంగా అందించారు. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

On
పవిత్రమైన రామాయణాన్ని మహర్షి వాల్మీకి ప్రపంచానికి వరంగా అందించారు. - జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

పవిత్రమైన రామాయణాన్ని మహర్షి వాల్మీకి ప్రపంచానికి వరంగా అందించారు.             -  -జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల అక్టోబర్ 17 (ప్రజా మంటలు) :

మహర్షి వాల్మీకి తన కవిత్వం ద్వారా సామరస్యం, ప్రేమ, త్యాగం, అభివృద్ధి ఆధారిత పాలనను ప్రపంచ వ్యాప్తంగా చాటుతూ అందరి అభిమానాన్ని చూరగొన్నారని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహార్శి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్యాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుందని, అన్నారు.

 

అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.  రామ కావ్యం వెలుగులో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుటంటూ అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు' తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, పి, రాంబాబు, గౌతమ్ రెడ్డి, వివిధ జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంతరావు, ఆర్డిఓ మధుసూదన్, బిసి వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

------

Tags