విద్యలో అమ్మాయిలతో అబ్బాయిలు పోటీ పడలేక పోతున్నారు 

సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మి నారాయణ కామెంట్స్..

On
విద్యలో అమ్మాయిలతో అబ్బాయిలు పోటీ పడలేక పోతున్నారు 

హనుమకొండ ఆగస్టు 13 ప్రజామంటలు :

విద్యలో అమ్మాయిలతో అబ్బాయి లు పోటీ పడలేక పోతున్నారని, విద్య లో సెల్ ఫోన్ ద్వారా లక్ష్యం పై ద్రుష్టి సారించలేక పోతున్నారని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మి నారాయణ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,లక్ష్యం సాధించాలంటే సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని, విద్యార్థులు ఇతరులతో పోటీ పడకుండా... మీతో మీరు పోటీ పడాలని సూచించారు...

గ్రామీణ ప్రాంతంలోనూ గంజాయి లాంటి మత్తు పదార్దాలు లభిస్తుండటం బాధగా ఉందని, దేశం లో నిరుద్యోగ సమస్య తీవ్ర మవుతున్నదని అన్నారు. 

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి మత్తుకు బానిసగా మారుతున్నది యువత..

సినిమాల్లో నూ మత్తు పదార్ధాలు వాడకం అధికంగా చూపుతున్నారు... అలాంటి వాటిని తప్పించాల్సిన బాధ్యత సినిమా వాళ్ళ పై ఉంది... 

రాష్ట్ర ప్రభుత్వం కూడా మత్తు పదార్ధాల వినియోగానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్రజల్లో అవగాహనా తేవాల్సిన అవశ్యకత ఉంది.. పోలీస్ లు కూడా గంజాయి తదితర వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు...

Tags