జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు రైతు సంఘం మద్దతు

On
జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు రైతు సంఘం మద్దతు

జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత ఐ.జె.యి జాతీయ కౌన్సిల్ సభ్యులు జె.సురేంద్ర కుమార్

జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు రైతు సంఘం మద్దతు

జగిత్యాల ఆగస్టు 12:

జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు రైతు సంఘం మద్దతుగా నిలుస్తుందని రైతు సంఘం జిల్లా నాయకులు అన్నారు రైతులకు గిట్టుబాటు ధర కోసం చేసిన పోరాటంలో పాత్రికేయుల సహకారం  మర్చిపోలేనిది అన్నారు జర్నలిస్టులు కోరిన కోరికలు చాలా చిన్నవే,వాటిని ప్రభుత్వం త్వరలోనే  పరిష్కరించాలని అన్నారు జర్నలిస్టులకు న్యాయం జరగకపోతే రైతు సంఘం పక్షాన పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి ఐల్నేని సాగర్ రావు భూమ్ రెడ్డి శ్యాం రాజిరెడ్డి మల్లయ్య మోహన్ రెడ్డి రాజయ్య గంగారెడ్డి సురేందర్ రెడ్డి, గోపాలరావు, మల్యాల, పెగడపల్లి మండల ప్రెస్ క్లబ్, అధ్యక్షులు తిరుపతి రెడ్డి,శ్రీనివాసరెడ్డి సంఘ సభ్యులు మద్దతు తెలిపారు , ఈ కార్యక్రమానికి, బిజెపి  మహిళా మోర్చా నాయకురాలు ఎస్ భాగ్యలక్ష్మి మమత లక్ష్మీ కళావతి పుష్ప సోమలక్ష్మి,సభ్యులు పాల్గొన్నారు, వారితోపాటు  గో, సేన  అసోసియేషన్ యువత జిల్లా అధ్యక్షులు కట్ట శివకుమార్, జగిత్యాల ట్రస్మా నాయకులు కాటిపల్లి గంగారెడ్డి మనోహర్ రెడ్డి రామారావు శ్రీకాంత్ లతోపాటు  ట్రస్మ సంఘం నాయకులు  ఏఐఎస్ఎఫ్ కార్మిక సంఘం  నాయకులు ఎండి అక్రమ్, ముఖేష్ మహేష్, పాత్రికేయులకు సంఘీభావం తెలిపారు దీక్షలో పాల్గొన్న, పాత్రికేయులు,పన్నాల కమలాకర్ రెడ్డి,బొడ్డు పల్లి అంజయ్య,సిరిసిల్ల వేణుగోపాల్,మిర్యాల వంశీ కృష్ణ రావు, కడార్ల రంజిత్,సంకోజీ లింగమూర్తి, ఇట్టే రాజు,అనంతుల కాంతారావులకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాజుల రాజేందర్ మజీ వైస్ చైర్మన్ మన్సూర్,జగిత్యాల క్లబ్ కార్యదర్శి పుప్పాల అశోక్ కుమార్ దీక్షలో పాల్గొన్న పాత్రికేయులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

ఈ కార్యక్రమంలో టి.యు.డబ్ల్యూ జే.జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, రాగుల గోపాల చారి ల తోపాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాపాత్రికేయులు పాల్గొన్నారు.

జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత
ఐ.జె.యి జాతీయ కౌన్సిల్ సభ్యులు జె.సురేంద్ర కుమార్

జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు వారి హక్కుల సాధన  కోసం చేస్తున్న నిరవధిక నిరసన దీక్ష పదవ రోజుకు చేరుకుంది.ఈ, దీక్ష శిబిరానికి హాజరైన ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం  చేస్తున్న పోరాటం జర్నలిస్టుల హక్కు అని అన్నారు జర్నలిస్టులను తక్కువ చేసి చూస్తే సహించేది లేదన్నారు గత ప్రభుత్వాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మండల కేంద్రాలలో ఇళ్ల స్థలాలు సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు జగిత్యాల లో పనిచేస్తున్న పాత్రికేయులకు స్థలం ఇప్పించడంలో నిమ్మకు నీరెత్తినట్టు ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారన్నారు 

Tags