ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు గెస్ట్ లెక్చరర్స్ వినతిపత్రం
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు గెస్ట్ లెక్చరర్స్ వినతిపత్రం
జగిత్యాల ఆగస్టు 14:
జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసంలోప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లను మర్యాద పూర్వకంగా కలిసి, వారి సమస్యల పైన వినతి పత్రం అందజేశారు
ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం, MTS లెక్చరర్ల మాదిరిగానే కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో త్రీ మెన్ కమిటీ, ఓపెన్ నోటిఫికేషన్. ఇంటర్వ్యూ, డెమో, పీజీ మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికయ్యాము. MTS లెక్చరర్లు సైతం గతంలో కో పార్ట్ టైం లెక్చరర్లుగా.. ప్రస్తుత గెస్ట్ లెక్చరర్ల మాదిరిగానే పీరియడ్ విధానంలో పనిచేయగా ఆనాటి ప్రభుత్వం వారి సేవలను గుర్తించి MTS గా మార్చి "ఉద్యోగ భద్రత" కల్పించారు
ప్రస్తుతం పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లలో దాదాపు చాలా మంది ఏజ్ బార్ అయి ప్రస్తుత పోటీ పరీక్షలకు అనర్హులుగా ఉన్నారు.. మేము, మా కుటుంబాలు అంతా 11 ఏండ్లుగా ఆధారపడి ఉన్నాం ప్రస్తుత మా ఉద్యోగాల పైనే తమరు మాకు ఉద్యోగ భద్రత కల్పించగలరని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కోరారు