డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి  రాష్ట్ర ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్  

On
డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి  రాష్ట్ర ప్రభుత్వ విప్  అడ్లూరి  లక్ష్మణ్ కుమార్  


జగిత్యాల ఏప్రిల్ 5(ప్రజా మంటలు)
డా.   బాబు జగ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిల వాలి అన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

శనివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంచినీళ్ల భావి చౌ రాస్తా సమీపంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ  జయంతి కార్యక్రమంలో   ప్రభత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   అడిషనల్  కలెక్టర్  లత  , అధికారులు  , 
పుర  ప్రముఖులు  దళిత  నాయకులు  ఆయన  విగ్రహం నకు పూల మాలలు వేసి  ఘనంగా  నివాళులు  అర్పించారు.

 ఈ సందర్బంగా  ఏర్పాటు  చేసిన సమావేశం లో  ప్రభుత్వ విప్ మాట్లాడుతూ 
డా. బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతర భారత నిర్మాణంలో అపూర్వమైన సేవలు అందించిన అందించిన మహనీయుడని అన్నారు.1908 ఏప్రిల్ 5న జన్మించిన ఆయన, స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడిగా నిలిచారని తెలిపారు. ఆయన అత్యంత కాలం కేబినెట్ మంత్రిగా కొనసాగిన ఘనత గల నేత మాత్రమే కాకుండా, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి గా,కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసి గ్రీన్ రివల్యూషన్‌ను సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని ఆహార ధాన్యాల పరంగా స్వయం సమృద్ధిగా మార్చిన వారని పేర్కొన్నారు.రక్షణ మంత్రిగా ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారతదేశానికి విజయాన్ని సాధించిపెట్టడంలో ఆయన నాయకత్వం విశేషమని, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంలో ఆయన పాత్రను మరువలేమని అన్నారు. సామాజిక  విప్లవానికి ఆయన చేసిన కృషి అపూర్వమని, డా.బి.ఆర్.అంబేద్కర్ తీరునే ఆయన కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు చేసిన కృషి సమాజానికి దిశానిర్దేశకంగా నిలిచాయని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించిన నేతగా బాబు జగ్జీవన్ రామ్ భారత చరిత్రలో నిలిచిపోయారని అభిప్రాయపడ్డారు.
నేటి యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలాని, ఆయన ఆదర్శాలను అనుసరించాలని ఆయన అన్నారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్  లత మాట్లాడుతూ  ఆయన జీవితంలో అంటరానితనం పరిస్థితుల నుంచి ఉప ప్రధాని పదవి వరకు అనేక అంశాలను చూశారని తెలిపారు.
చిన్నతనంలో పాఠశాలలో అంటరానితనం సమస్యతో అనేక బాధలు అనుభవించారని, 29 ఏళ్ళ వయస్సులో శాసన మండలి సభ్యునిగా, 1937 లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. 1946లో తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి గా పని చేశారని, స్వాతంత్ర్య వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో 30 సంవత్సరాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పని చేశారని తెలిపారు. ‌

వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడారు.

కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మాజీ మున్సిపల్ కమిషనర్ విజయలక్ష్మి ఆర్డీవో పులి మధుసూదన్ గౌడ్ ,డిఎస్పి రఘు చందర్ మున్సిపల్ కమిషనర్ ,రెవెన్యూ  అధికారులు , జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఎస్సీ, బీసీ, ఎస్టీ సంఘ, వివిధ సంఘాల నాయకులు,  ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Tags

More News...

Local News 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో హరిహరాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు  జగిత్యాల ఏప్రిల్ 6 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వైదిక క్రతువులు బుడి అరుణ్ శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, అన్యారంభట్ల సాంబయ్య శర్మ తదితరులు నిర్వహించారు....
Read More...
Local News 

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం

గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం భీమ్రాజు పల్లి లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగాయి ఆలయ చైర్మన్ బొమ్మన కుమార్- మాధవి దంపతులు, ఉపాధ్యాయులు కందుకూరి మధుకర్ రెడ్డి, దంపతుల చేత కళ్యాణం నిర్వహించారు మాజీ సర్పంచ్ రెవెళ్ల సుజాత లింగయ్య, సత్యనారాయణ కరుణశ్రీ  దంపతులు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో రిటైర్...
Read More...
Local News 

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర

ప్రారంభమైన రాములోరి శోభాయాత్ర భీమదేవరపల్లి మార్చ్ 7 (ప్రజామంటలు)  :   శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి శోభాయాత్ర ముల్కనూర్ లో శ్రీ సాంబమూర్తి దేవాలయం నుండి బస్టాండ్ వరకు కన్నుల పండువగా కొనసాగుతుంది. ముల్కనూర్ హనుమాన్ వ్యాయామశాల ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగించారు. జైశ్రీరామ్ నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. యువత కాషాయ జెండాలు పట్టుకొని జైశ్రీరామ్ నినాదాలతో హోరోత్తించారు. శోభాయాత్రలో భక్తులు
Read More...
Local News  Spiritual  

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం

ధర్మపురిలో నయనానందకరం సీతారామ కల్యాణం ( రామ కిష్టయ్య సంగన భట్ల  9440595494) రామ కల్యాణోత్సవ వేడుకలు వైభవో పేతంగా, కన్నుల పండువగా జరిగాయి. ధర్మపురి క్షేత్రంలో గోదావరి తీరాన వెలసిన శ్రీరామాలయంలో ఉదయం శ్రీరామ జన్మో త్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన వంశపారంపర్య అర్చకులు తాడూరి బాలకిష్టయ్య శర్మ, బలరామ శర్మ, బాలచంద్రశర్మ, రఘునాథ శర్మ, మోహన్ శర్మ,...
Read More...
Local News 

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం

శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం భారీగా తరలివచ్చిన భక్తులు గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో   శ్రీకళ్యాణ రామచంద్ర ఆలయ ప్రాంగణంలో  రాములోరి  శ్రీరామ నవమి వేడుకలు ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య -సువర్ణ  అర్చకులు తిరుణారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు మధ్య శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు కళ్యాణ రామచంద్రస్వామికి.అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల...
Read More...
Local News 

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు.

వృద్ధుల సంరక్షణ,మహిళా చట్టాలపై అవగాహన సదస్సు. జగిత్యాల ఎప్రిల్ 6 : తెలంగాణ అల్ సీనియర్ సిటిజెన్స్, ,పెన్షనర్స్  అసోసియేషన్ల  జగిత్యాల జిల్లా  శాఖల  ఆధ్వర్యంలో  ఆ సంఘాల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ జన్మదినోత్సవం  సందర్భంగా  వయోవృద్ధుల రక్షణ,పోషణ సంక్షేమ చట్టం పై   సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,సఖి , భరోసా,మహిళా  చట్టాలపై  రిటైర్డ్ జాయింట్...
Read More...
National  Filmi News 

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్

మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్ .L 2 - ఎంపురాన్ అత్యధిక వసూళ్లు సాధించిన L 2- ఎంపురాన్ చిత్రం హైదరాబాద్ ఎప్రిల్ 05:  మోహన్ లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ ఆల్ టైమ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది.ఇప్పుడు మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మలయాళ చిత్ర పరిశ్రమ కొత్త బెంచ్ మార్క్. ఈ క్షణం...
Read More...
Local News 

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం.

కమనియం రమనియం శ్రీ సీతరాముల కళ్యాణం. స్వామి వారి ఉత్సవ ముర్తుల ఉరేగింపు.అలయకమిటీ అధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం.   సీతారాముల వారికి ఓడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు. ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 5 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   కమనీయం రమణీయంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో శ్రీసితరామలక్ష్మణ బలంజనేయస్వామి,ఎర్దండీ లో నుతనంగా నిర్మించిన అలయకమిటీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

సికింద్రాబాద్ లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం   సికింద్రాబాద్, ఏప్రిల్ 6 (ప్రజామంటలు)::   సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఆదివారం శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ఆదం సంతోష్ కుమార్ సందర్శించారు.  ఈ సందర్భంగా ఆయన శ్రీ సీతారామ కళ్యాణ వేడుకల్లో
Read More...
Local News 

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం

గాంధీలో కాలోజీ వర్సిటీ వీసీకి ఘన సన్మానం సికింద్రాబాద్, ఏప్రిల్ 6 (ప్రజా మంటలు):   గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుత కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి  నందకుమార్ రెడ్డి వైద్యరంగం కు చేసిన సేవలు ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం గాంధీ అలుమ్ని  అసోసియేషన్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అయన్ని ఘనంగా సత్కరించింది. గాంధీ మెడికల్...
Read More...
Local News 

సభ సక్సెస్ అయ్యేనా ??

సభ సక్సెస్ అయ్యేనా ?? కోర్టును ఆశ్రయించనున్న బి.ఆర్.ఎస్ నేతలు
Read More...
Local News 

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం

కళ్యాణం కమనీయం... కళ్యాణి క్షేత్ర శ్రీ సీతారాముల కల్యాణం భీమదేవరపల్లి ఏప్రిల్ 7 (ప్రజామంటలు) : భారతరత్న "మాజీ‌ ప్రధాని‌" పి.వి.నరసింహారావు స్వస్థలం వంగర గ్రామ కైలాస కల్యాణి క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు పాత శివాలయం నుండి ఉత్సవ మూర్తులను‌ కైలాస క్షేత్రం...
Read More...