ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి. ఏ డి ఈ మనోహర్
మెట్ పెల్లి ఏప్రిల్ 3 (ప్రజా మంటలు)
వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా, భూగర్భ జలమట్టాలు శీఘ్రంగా పడిపోతున్నాయని, విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతున్నదని కావున రైతులు నీటిని పంటలకు అవసరం ఉన్నంత మేరకే వాడుకోవాలని, ఆటో స్టార్టర్లతో వృథా చేయరాదని మెట్ పల్లి ఏడీఈ మనోహర్ ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు.
మరో రెండు వారాల్లో వరి పంట కోతదశకు చేరుకోనుందని ఎవరైనా రైతులు ఆటో స్టార్టర్లను వినియోగించి అవసరానికి మించి నీటిని తోడడం వలన నీరు వృధాగా కాలువల్లో, వాగుల్లో పడిపోవడం వల్ల అనవసరంగా నీటితో పాటు విద్యుత్ కూడా వృధా అవుతుందని దానివల్ల భూగర్భ జలమట్టాలు కూడా అడుగంటి పోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియతో అవసరం ఉన్న రైతులకు నీరు అందకుండా పోతుందని, వారి పంటల పట్ల కూడా సామాజిక బాధ్యత వహించాలని రైతులకు మనవి చేశారు.
ఏ ఒక్కరూ కూడా ఆటో స్టార్టర్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు.
మెట్టుపల్లి మరియు మల్లాపూర్ సబ్ డివిజన్ పరిధిలో సుమారు 32 వేల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు నడుస్తున్నాయని వాటికి నిరంతర ఉచిత విద్యుత్తు ప్రతిరోజు 11.22 లక్షల యూనిట్లు సరఫరా జరుగుతుందని తెలిపారు.
28 సబ్స్టేషన్ లు, 122 11కెవి ఫీడర్లు, 5 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ల ద్వారా నాణ్యమైన విద్యుత్ అందించుట కొరకు సిబ్బంది ఎల్లవేళలా వినియోగదారులకు అందుబాటులో ఉండి కృషి చేస్తున్నారని, ఏదైనా సరఫరాలో లోపం తలెత్తితే 1912 కు కాల్ చేయాలని సూచించారు.
కావున రైతు సోదరులు పంటలు పూర్తిస్థాయిలో చేతికి అందేంతవరకు అప్రమత్తంగా ఉండాలని నీటిని, విద్యుత్ ను వృధా చేయకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని, భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ రఘు చందర్

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ

కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం
