రాజీవ్ యువ వికాసం పథకంలో అధికారుల లాలుచీ
*ముడుపులు ఇస్తేనే ఆదాయ, కుల సర్టిపికెట్లు
*సికింద్రాబాద్ రెవిన్యూ ఆఫీస్ లో అధికారుల నిర్వాకం
*ఆర్టీవో కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
సికింద్రాబాద్ ఏప్రిల్ 09 (ప్రజామంటలు):
యువతకు స్వయంఉపాధి రుణాలిచ్చి, వారికి జీవనోపాధి చూపించే ప్రభుత్వ ప్రతిష్మాత్మక రాజీవ్ యువ వికాక పథకం అధికారుల పాలిట కామథేనువు లా మారింది. ఆదాయ,కుల దృవీకరణ పత్రాల జారీకి సికింద్రాబాద్ మండల రెవిన్యూ సిబ్బంది దరఖాస్తులదారులు డబ్బులు ఇవ్వనిదే పత్రాలు ఇవ్వడం లేదని బన్సీలాల్ పేట కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి సికింద్రాబాద్ ఆర్టీవో సాయిరామ్ కు బుధవారం ఫిర్యాదు చేశారు.
డిప్యూటీ తహసీల్దార్, ఇతర అధికారులకు బన్సీలాల్ పేట డివిజన్ కు చెందిన పలువురు దరఖాస్తు దారులు డబ్బులు పంపిన గూగుల్ పే, ఫోన్ పే స్క్రీన్ షాట్ లను ఆర్టీవోకు అందచేశారు. అనర్హుల నుంచి డబ్బులు తీసుకుంటున్న రెవిన్యూ అధికారులు ఫీల్డ్ ఎంక్వేరీ ఏమీ చేయకుండానే ఆదాయ దృవీకరణ పత్రాలను జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. దాంతో నిజమైన పేద, మద్య తరగతి ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని వారు వాపోయారు. లంచం డబ్బులిచ్చిన వారికి రూఒక లక్షా90 వేలు, డబ్బులివ్వకపోతే రూ 2.20 లక్షల ఆదాయ సర్టిఫికెట్లను ఇస్తున్నారని వారు ఆరోపించారు. దాంతో అర్హులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాస పథకాన్ని పొందలేకపోతున్నారని తెలిపారు. తాను కుల, ఆదాయ సర్టిఫికెట్ కోసం వారం రోజుల నుంచి ఆఫీస్ నుంచి తిరుగుతున్నప్పటికీ అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వలేదని, చివరికి డిప్యూటీ తహసీల్దార్ రంజనికి రూ 500 ఫోన్ పే చేస్తే, అప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారని, బన్సీలాల్ పేట కు చెందిన మోసెస్ వాపోయారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు సకాలంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లను అందచేయాలని ఐత చిరంజీవి, సాయి సందీప్, మోసెస్, అబ్దుల్ కలీమ్ లు ఆర్డీవో కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఆర్డీవో తప్పనిసరిగా ఈ వ్యవహరంపై విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారని వారు పేర్కొన్నారు.
ఏసీబీ అధికారులు కూడ సికింద్రాబాద్ మండల రెవిన్యూ సిబ్బంది లంచాల డిమాండ్, స్వీకరణపై పోకస్ పెట్టాలని, తాము ఇచ్చిన ఆదారాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
