ఉగ్రనారసింహునికి భక్తజన నీరాజనం
(రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494)
గోదావరీ తీరస్థ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో సనాతన సంప్రదాయ రీతిలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శని
వారం జరిగిన శ్రీ ఉగ్రనార సింహుని ఏకాంతోత్సవ వేడుకలకు అశేష భక్తులు విచ్చేశారు. ఉదయాత్పూర్వం ఉగ్ర లక్ష్మీ నారసింహ ఆలయాన్ని తెరవగా, సంప్రోక్షణం చేసిన అనంతరం దేవస్థానం యాజ్ఞికులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ముఖ్య అర్చకులు శ్రీనివాసాచార్య, నరసింహమూర్తి, అరుణ్, వంశీ, దేవస్థానం ఎసి,ఇఓ శ్రీనివాస్, కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల పర్యవేక్షణలో, భక్తుల గోత్రనామ యుక్త పూజలు, నిత్య అర్చనలు, నిత్య కల్యాణంతో పాటు ఉత్సవ ముగింపు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మొక్కులు తీర్చుకున్న భక్తజనావళి
పరమ పవిత్ర గోదావరి నదిలో
మంగళ స్నానాలు ఆచరించిన భక్తులు, సుప్రభాత దర్శనానికి వివిధ ఆలయాల ముందు బారులుతీరి నిలుచున్నారు. కోరిన కోర్కెలు తీర్చే వరదుడుగా వినతికెక్కిన ఉగ్రనారసింహునికి ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఒక కనుములో కొబ్బరికాయ, ఖర్జూరపు పండ్లు, పోకలు, మొక్కులు కలిపి కట్టి లక్ష్మీ సమేత నార సింహుని సన్నిధిలో ఉంచడం ద్వారా కోర్కెలన్నీ నెరవేరగలవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే శని వారం అత్యధిక సంఖ్యలో భక్తులు ఆలయంలో ముడుపులు కట్టి, వల్లు బండ, గండాదీపాది మొక్కులు తీర్చుకున్నారు.
ఆంజనేయ సన్నిధిలో భక్తజనం
దీక్షాపరులైన భక్తులతో ఆంజనేయ ఆలయం కిటకిటలాడింది. ఇటీవలి కాలంలో ధర్మపురి క్షేత్రస్థ దేవస్థానం లో సాంప్రదాయ రీతిలో హన్మాన్ దీక్షలను స్వీకరిస్తున్న నేపథ్యంలో, చైత్ర పౌర్ణమి హన్మాన్ జయంతిని పురస్క రించుకుని, 21రోజుల పాటు ఆచరించే దీక్షలలో భాగంగా, శని వారం పెద్ద సంఖ్యలో ప్రత్యేక హన్మాన్ అర్ధ మండల దీక్షలను స్వీకరించేందుకై అరుదెంచి, పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలను ఆచరించి, పునీతులై, శ్రీలక్ష్మీ నరసింహ దేవ స్థానాంతర్గత ప్రసన్నాంజనేయ ఆలయం ముందు దైవదర్శనార్ధం బారులుతీరి వేచి ఉన్నారు. దేవ స్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ, ఆలయ అర్చకులు వొద్దిపర్తి నర్సింహమూర్తి, కళ్యాణ్ ఆధ్వర్యంలో అంజనీ తనయునికి ప్రత్యేక అభిషేకాలు, నిత్యవిధి పూజలు, అర్చనలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు పర్యవేక్షించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
