గంజాయి అమ్ముతూ పట్టుబడిన యువకుడి అరెస్ట్,
మెట్టుపల్లి మార్చ్ 22( ప్రజా మంటలు దగ్గుల అశోక్).:
ఇబ్రహింపట్నం మండలం మేడిపల్లి గ్రామా శివారులోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉదయం 10:15 గంటలకు జాతీయ రహదారి (63) పై ఇబ్రహింపట్నం ఎస్సై. ఏ. అనిల్ తన సిబ్బంది తో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నిజామబాద్ వైపు నుండి మెట్టుపల్లి వైపు ఒక మోటార్ సైకిల్ పై వస్తు, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని, వెంటనే పోలీసులు వెంబడించి, ఒకరిని పట్టుకొని విచారించగా ఆ యువకుడు గంజాయి అమ్ముతున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.
కోరుట్ల పట్టణంలో వినాయక విగ్రహాలు తయారు చేసే షాపులో కూలీగా పనిచేస్తున్నపోగుల అజయ్ (23) గా గుర్తించారు.
అతని వద్ద నుండి 300 గ్రాముల గంజాయి, ఒక హీరో HF-Delux బైక్ (TS02ED0209), ఒక ఐఫోన్ SE మొబైల్ ఫోన్ (6304763800) లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 15,000/- గా పోలీసులు తెలిపారు. అజయ్ మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన మొహమ్మద్ అజార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలుచేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి కోరుట్ల, మెట్టుపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలలో అధిక ధరకు అమ్ముతున్నట్లు నిందితుడు తెలిపాడు.
గతంలో కూడా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన ఒక గంజాయి కేసు మరియు ఇతర రెండు కేసులలో లో జైలుకు వెళ్ళినట్లు అతను ఒప్పుకున్నాడు.నిందితుడిపై ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు మరియు ఈ కేసులో పరారిలో ఉన్న మరొక నిందితున్ని త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరు పరుస్తాము అని సి.ఐ. ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
