ఎంపీ ఈటలకు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వాలి
సికింద్రాబాద్, ఏప్రిల్ 09 (ప్రజామంటలు):
మల్కాజిగిరి ఎంపీ,సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ కు తెలంగాణ రాష్ర్ట భారతీయ జనతా పార్టీ అద్యక్ష పదవిని ఇవ్వాలని కోరుతూ అఖిల భారత ముదిరాజ్ కోలి సమాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు పార్టీ అగ్రనాయకులను కోరారు.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, బడుగు బలహీన వర్గాల ప్రజల నాడీ తెలిసిన ఈటల రాజేందర్ రాష్ర్ట బీజేపీ సారథి పోస్టుకు అన్ని విధాలా అర్హుడని ఆయన పేర్కొన్నారు. రెండు సార్లు రాష్ర్ట కేబినేట్ మంత్రిగా, ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో హెల్త్ మినిస్టర్ గా ప్రాణానికి తెగించి రాష్ర్టానికి ఆయన చేసిన సేవలు అమూల్యమైనవని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట సాధనలో ఈటల రాజేందర్ పాత్ర చిరస్మరణీయమన్నారు. రాష్ర్ట జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి ఈటల రాజేందర్ కు రాష్ర్ట బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇస్తే , ముదిరాజ్ లకు సరైన గౌరవం దక్కినట్లు తమ కమ్యూనిటీ భావిస్తుందని అన్నారు. పార్టీలో ఎలాంటి గ్రూప్ లు, కాని పక్షపాతం గాని చూపకుండా, అందరిని ఒకే విదంగా చూస్తూ, అందరితో మమేకంగా వ్యవహరించే ఈటల రాజేందర్ కు స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ పోస్టును ఇవ్వాలని పొట్లకాయల వెంకటేశ్వర్లు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లకు బుధవారం పంపిన లేఖ లో కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
