దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఎమ్మెల్యేను ఉద్దేశించి సవాల్ విసిరారు.
జగిత్యాల నియోజకవర్గం కార్యాలయం "కమల నిలయం" లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ
నేను నా చైర్మన్ పదవికి అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష బిజెపి పార్టీలో గౌరవప్రదంగా చేరాను.
2018లో లక్ష ఓట్లు వచ్చాయి అన్ని గర్వంగా చెప్పుకున్నారు కదా, 2023 లో 40వేల ఓట్లు ఎందుకు తగ్గాయనీ ప్రశ్నించారు.
కోట్లు ఖర్చు పెడితే 8% ఓట్ల తేడాతో గెలిచారు.. మరి అప్పటికీ ఇప్పటికీ ఓట్ల శాతం ఎందుకు తగ్గింది
బిల్లుల కోసం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నీతులు మాట్లాడడం హాస్యాస్పదం.
నిన్ను నమ్మిన వారి ఆత్మ గౌరవాన్ని పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టావు.
మీరు నియోజకవర్గ అభివృద్ధి కంటే మీ సొంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు.
సంజయ్ కుమార్ ది తెరిచినా పుస్తకం కాదన్నారు .
జగిత్యాల లో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం మీతోనే సాధ్యం.
2017లో భూమి పూజ చేసిన డబుల్ ఇల్లు ఎందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పూర్తికాలేదు దానికి మీ బంధువులే కదా కాంట్రాక్టర్లు...?
4 వేల నుండి 43 వేల ఓట్లు మా కార్యకర్తల కష్టం మరియు పార్టీ సపోర్ట్ ప్రజలు దీవించి ఇచ్చిన గౌరవప్రదమైన తీర్పు అది.
స్థానం గురించి మాట్లాడుతున్నారు కదా...?
ప్రజలు నీపై ఉన్న అభిప్రాయం ఇటీవల జరిగిన సర్వేలో మిమ్మల్ని 108వ స్థానంలో ఉంచారు అది గుర్తుపెట్టుకుని మాట్లాడండన్నారు.
దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు.
బి ఆర్ ఎస్ లేదా కాంగ్రెస్ నుండి ఏ పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటావో తెచ్చుకో నేను బిజెపి తరపున నిలుచుంటా పోటీ చేస్తా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రా... అన్ని ఇటీవల కొన్ని మీడియా పత్రికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్థాయి గురించి మాట్లాడినందుకు గాను డాక్టర్ బోగ శ్రావణి ఎమ్మెల్యే మాటలకు చురకలు అంటించారు.
ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాం జగిత్యాల ప్రజలు ఎమ్మెల్యేకి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న,మహిళ మోర్చా ప్రదాన కార్యదర్శి సాంబరి కళావతి,మహిళ మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు పవన్ సింగ్, సింగం పద్మ, కాశెట్టి తిరుపతి, గడ్డల లక్ష్మి ఇట్యాల రాము మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
