కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 9(ప్రజా మంటలు)
ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ బి. సత్య ప్రసాద్
బుధవారం మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ,జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11 నుండి జయంతి కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో 10వ తేదీలోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని, క్రింది స్థాయి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 3 రోజుల పాటు లైటింగ్, హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 11 వ తేదీ రాత్రి నుండి 13 వ తేదీ ఉదయం వరకు సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, సుమారు 45 వేల మంది మాల విరమణ చేస్తారని తెలిపారు.
ఈ 3 రోజుల పాటు 14 కౌంటర్లను ఏర్పాటు చేసి సుమారు 5 లక్షల ప్రసాదలను అందుబాటులో జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో 64 సి. సి. కెమెరాలు ఉండగా అదనంగా 50 సి. సి. కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, 6 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. అలాగే 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు. ఇందుకోసం ఒక వేదికను ఏర్పాటు చేసి 100 మంది కూర్చునే విధంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కొండపైకి వెళ్లేందుకు ఆర్. టి. సి. బస్సులను పెంచాలని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆదేశించారు. చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని, కోనేరు వద్ద భక్తులు అధిక సంఖ్యలో స్నానం ఆచరించే వీలు ఉన్నందున ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులను, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను, 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని విద్యుత్ అధికారులను ఆయన ఆదేశించారు.
కేశఖండనకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా కళ్యాణ కట్ట వద్ద ఎక్కువ మంది నాయీబ్రాహ్మణులను ఏర్పాటు చేయాలని, అధికారులకు సూచించారు. పబ్లిక్ టాయిలెట్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జయంతి ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయుటకు షిఫ్ట్ ల వారీగా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, డి. ఎస్పీ., రఘు చందన్, కొండగట్టు ఆలయ ఈ. ఓ. శ్రీనివాస రావ్ , జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ , కలెక్టరేట్ ఏ. ఓ. హకీం, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందన , ఎంపీడీఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
