కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

On
కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

సికింద్రాబాద్ ఏప్రిల్ 09 (ప్రజామంటలు):

 దేశంలోనే మొట్టమొదటిసారిగా బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో మెడ్రానిక్ సంస్థతో కలిసి రీనల్ డెనర్వేషన్ థెరపీ (Renal Denervation Therapy) క్లినిక్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్  హెడ్ ఆఫ్ కార్డియాలజీ & కార్డియోథోరాసిక్ సర్జన్ డా. శ్రీధర్ కస్తూరి తెలిపారు.

బుధవారం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ లో ప్రపంచస్థాయి వైద్య సాంకేతికత రంగంలోని ఒకటైన మెడ్ట్రానిక్ సంస్థతో కలసి రీనల్ డెనర్వేషన్ థెరపీ (Renal Denervation Therapy) కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ భాగస్వామ్యం మెమోరాండం ఆఫ్ అండర్‌ స్టాండింగ్ (MoU) ద్వారా అధికారికంగా  కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. బి. భాస్కర్ రావు మాట్లాడుతూ.... "సాంప్రదాయ చికిత్సలతోనూ నియంత్రణలోకి రాని హైపర్‌ టెన్షన్ నేడు అత్యంత తీవ్ర ఆరోగ్య సమస్యగా మారిందని, మెడ్ట్రానిక్‌తో మేము చేస్తున్న ఈ వ్యూహాత్మక  భాగస్వామ్యం ఆధునిక, ఆధారిత చికిత్సలను అందించడంలో విప్లవాత్మక ముందడుగుగా నిలుస్తుందన్నారు.

ఇది కేవలం సాంకేతికత విషయమే కాదు, ఇది మా వైద్యులకీ, రోగులకీ సమగ్ర శిక్షణ, జ్ఞానం మరియు అనుభవాలను కలిసివచ్చే హోలిస్టిక్ కేర్ వ్యవస్థను నిర్మించాలనే దిశగా ముందుకు తీసుకెళ్తోందదని, తాము హైపర్‌టెన్షన్ నిర్వహణకు కొత్త ప్రమాణాలను స్థాపించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.   కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏవి గురవారెడ్డి మాట్లాడుతూ "ఈ భాగస్వామ్యం తో నియంత్రించలేని రక్తపోటుతో బాధపడే రోగులకు ఆధునిక చికిత్సను అందించాలనే ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగు అన్నారు. మెడ్ట్రానిక్ సంస్థ అందించే టెక్నాలజీని తమ నైపుణ్యత్వంతో కలిపి, హైపర్‌టెన్షన్ నిర్వహణలో కొత్త యుగానికి దారితీస్తున్నామన్నారు. తమ లక్ష్యం కేవలం వైద్య ఫలితాలను మెరుగుపరచటం మాత్రమే కాదు, ఔషధ చికిత్సలకు మించి శాశ్వతమైన పరిష్కారాలను అందించడం ద్వారా రోగులను శక్తివంతులుగా చేయడమే అన్నారు.

మెడ్ట్రానిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైస్ ప్రెసిడెంట్ మందీప్  సింగ్ కుమార్ మాట్లాడుతూ  "మెడ్ట్రానిక్‌లో, మేము స్థిరమైన ఆవిష్కరణలు మరియు సమర్థవంతమైన భాగస్వామ్యాల ద్వారా ఆరోగ్య సంరక్షణను రూపాంతరం చేయాలనే నిబద్ధత కలిగి ఉన్నామని తెలిపారు. కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్‌తో భాగస్వామ్యం ద్వారా, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు అభివృద్ధి చెందిన శిక్షణను అందించడమే కాకుండా, రీనల్ డెనర్వేషన్ థెరపీపై అవగాహన పెంచడానికీ ఇది దోహదపడుతుందన్నారు.

కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్  హెడ్ ఆఫ్ కార్డియాలజీ ఆండ్ కార్డియోథోరాసిక్ సర్జరీ డా. శ్రీధర్ కస్తూరి  మాట్లాడుతూ... హై బీపీ ( అధిక రక్తపోటు) కారణంగా హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం, మెదడులో రక్తస్రావం  సంభవిస్తున్న 100 మరణాల్లో 10 మరణాలు ఉంటున్నాయని తెలిపారు. అడల్ట్స్ లో ప్రతి ముగ్గురిలో ఒకరికి హైబీపీతో బాధపడుతున్నారని ఐ సి ఎం ఆర్ గైడ్లైన్స్ ప్రకారం తెలుస్తుందన్నారు. మీడియా సమావేశంలో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ సి ఓ ఓ సుధాకర్ జాదవ్ తో పాటు కార్డియాలజిస్టులు డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ కావ్యతో పాటు  వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది *సేవలో తరిస్తున్న వాసవి మహిళ సంఘం ఎంతో  గ్రేట్..    *విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ సరోజ వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): ఫ్యాషన్ వల్లే  మనం ఏదైనా సాధించ గలుగుతామని. అలాగే వాసవి మహిళా సంఘం నిర్వాహకులు  నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటు, తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ, డా.అంబేడ్కర్...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని చందోలి, బొంకూరు, వెనుగుమట్ల, లోత్తునూరు,వెంగళపూర్, శంకర్రావుపేట్ గ్రామాల్లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్  గురువారం రోజు ప్రారంభించారు.ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలలో రైతులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను...
Read More...
Local News 

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ    సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు): అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో  ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్...
Read More...
Local News 

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు విజయం సాధించిన డా.సుభోద్, డా.రాజేశ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన రెండు జనరల్ కౌన్సిల్ మెంబర్ (ఒకటి ప్రొఫెసర్ క్యాడర్, మరొకటి అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ) పోస్టులకు గురువారం గాంధీ ఆసుపత్రిలో ఎన్నికలు జరిగాయి. ఉదయం...
Read More...
Local News 

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి 

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపెల్లి మండల కేంద్రంలోని వెంగలాపూర్ అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ మల్యాల వీరలక్ష్మి  ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా  పిల్లల బరువుల గురించి తల్లులకు అవగాహన కల్పించడం  బరువు తక్కువ ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మరియు స్థానికంగా లభించే పండ్లు కూరగాయలు గుడ్డు ఆకుకూరలు పాలు వల్ల...
Read More...
State News 

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు   జపాన్ పర్యటన నుంచి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి   మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం  (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి ఎప్రిల్ 17:ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి...
Read More...
Local News 

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
Read More...
Local News 

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది - ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
Read More...
Local News 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి  గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళి అక్కడ ఇటీవల హత్యకు గురికాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు....
Read More...
Local News 

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర సికింద్రాబాద్  ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):  దశాబ్దల తరబడిగా ముదిరాజులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 18 నుంచి ముదిరాజ్ నాయకులు యువరాజ్ పాదయాత్ర చేపట్టబోతున్నారు.  మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని జాతీయ కోలీ సమాజ్ ఈసీ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ తెలిపారు. మేడారం...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేస్తున్న యాత్రలు బూటకం - బిజెపి నాయకురాలు రాజేశ్వరి  సికింద్రాబాద్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు...
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు....
Read More...