ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

On
ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

(రామ కిష్టయ్య సంగన భట్ల)

 సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష నుకు వేంకటపతి వెళ్ళి విశేష పూజలందుకోవడం ధర్మపురి క్షేత్రానికి మాత్రమే పరిమితమైన ప్రత్యేకత. ఈకార్యక్రమంలో భాగంగా మంగళ వారం సాయంత్రం దేవస్థానంలో దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర పూజలు నిర్వహించిన అనంతరం, మున్సిపాలిటీ, కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టేషన్, చైతన్య భారతి ప్రధాన రహదారిమీదుగా, బాజాభజంత్రీలు, వేదమంత్రాలతో, భక్తులు తోడురాగా స్వామివారిని సాంప్రదాయ రీతిలో ఊరేగించి దక్షిణ దిగ్యాత్ర నిర్వహించారు. ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు కుటుంబాలు స్టేషన్ ఆవరణ లోనికి స్వామివారిని ఆహ్వానించారు.

తమవద్దకు అపురూపంగా ఏతెంచిన స్థానిక ఇష్ట దైవాన్ని భక్తులు, పోలీసుల కుటుంబీకులు సాదరంగా, భక్తి శ్రద్ధలతో స్వాగతించారు. స్టేషన్ ప్రాంగణాన స్వామి ఉత్సవ మూర్తులను ఆసీనులజేసి, ప్రత్యేక పూజలొన రించారు. దేవస్థాన ఆస్థాన వేద పండితులు రమేశ శర్మ, అర్చక పురోహితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, రాజగోపాల్,  అర్చకులు శ్రీనివాసా చార్య, వామనాచార్య, మోహన్, తదితరులు పూజాదికాలు గావించారు. వేద పండితులు రమేశ శర్మ, వేదమంత్రాలతో విధివిధాన సాంప్రదాయ పూజాదికాలు గావించారు. ఆ పరిసర ప్రాంత ప్రజలు ఘనంగా పూజించి, వేదమూర్తుల ఆశీస్సుల నందుకున్నారు.

పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమాలలో ఈఓ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  కమిటీ అధ్యక్షుడు జక్కు రవీందర్,సభ్యులు, దేవస్థానం సిబ్బంది, ఎస్ ఐ శ్రీధర్, ఉమా సాగర్, పోలీసుల కుటుంబాలు, ప్రత్యేక విధినిర్వహణలోగల ఉద్యోగులు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుని ఉత్తర దిగ్యాత్ర

  బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళ వారం సాయంత్రం దక్షిణ దిగ్యాత్ర అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేద మంత్రాల మధ్య మంగళ వాద్యాలు తోడురాగా, పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి, ఉత్తర దిగ్యాత్రలో భాగంగా, క్షేత్ర శివారులోగల ఉసిరి చెట్ల వాగు వద్ద, సనాతన పద్ధతి ప్రకారం స్వాములను ఆసీనుల గావించారు. దేవస్థాన ఆస్థాన వేదపండితులు రమేశ శర్మ, అర్చక పౌరో హితులు సంతోష్ శర్మ, ప్రవీణ్ శర్మ, అర్చకులు శ్రీనివాసాచార్య, వామన్, కిరణ్, తదితరులు ప్రత్యేక అర్చనలు గావించారు. మార్గమధ్యలో భక్తులు మంగళ హారతులతో స్వాములకు స్వాగతం పలికారు. తమవ ద్దకు అపురూపంగా ఏడాదికోసారి ఏతెంచే తమ ఇష్ట దైవాన్ని కొలిచేందుకు పరిసర ప్రాంత ప్రజలు పూజా కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.IMG-20250318-WA0021 

కార్యక్రమానికి ముగింపుగా ఇసుకస్థంభం మండ పంలో స్వాములను ఆసీనుల గావించి, వేదపఠనం, ఆశీర్వచనాది కార్యక్రమాలను సనాతన పద్ధతిలో నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, సిబ్బంది. కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు అధిక సంఖ్యలో భాగస్వాములైనారు.

అలరించిన ప్రేంకుమార్ మిమి క్రీ

 ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా దేవసా స్థానం లో ని శేషప్ప కళా వేదికపై, స్థానిక నాట్యమండల సౌజన్యంతో నిర్వహించిన రాష్ట్ర మిమిక్రీ పితామహ బిరుదాంకితులైన గుండి ప్రేం కుమార్ మిమిక్రీ కార్యక్రమం ఆబాల గోపాలాన్ని అలరించింది. ఆరు దశాబ్దాల కాలానికి పైగా రాష్ట్రంతో పాటు రా ష్టేతర ప్రాంతాల్లోనూ వేలాది ధ్వన్యను కరణ ప్రదర్శనలు ఇచ్చి, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ నాయకులు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి సినీ ప్రముఖులు, సి. నారాయణ రెడ్డి, దాశరథి రంగాచార్య లాంటి సాహితీ వేత్తలతో పాటు పలు రంగాల ప్రముఖుల ప్రశంసలు అందుకున్న, ధర్మపు రి క్షేత్రానికి చెందిన గుండి ప్రేం కుమార్ పుట్టిన గడ్డపై దైవ సన్నిధిలో గంటకు పైగా ఇచ్చిన ప్రదర్శన ఆద్యంతం భక్తుల, యాత్రికుల, కళాకారుల నిర్వాహకులను ఆకట్టుకుంది. ప్రధానంగా వివిధ పక్షుల కూతలు, జంతువుల అరుపు లు, మువ్వల సవ్వడులు, హర్షధ్వనాలు, వివిధ ప్రయాణ సాధనాల ధ్వనులు, సితార్ వాద్యను కరణలు ఆహూతుల హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. దేవస్థానం పక్షాన మిమిక్రీ చక్రవర్తి ప్రేం కుమార్ను దేవస్థానం పక్షాన ఘనంగా సత్కరించారు.

Tags

More News...

Local News 

రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం హనుమకొండ మార్చి 19 (ప్రజామంటలు)  : హనుమకొండ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఆధ్వర్యంలో స్వయంకృషి మహిళా సొసైటీ వయోవృద్ధుల సహాయార్థం వృద్ధాశ్రమంలో పడకంటీ రామన్న జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. హనుమకొండ మ్యూజిక్ ఇంచార్జ్ బిక్షపతి చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్...
Read More...
Local News 

జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం

జిల్లా కలెక్టరు ని కలిసిన జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కార్యవర్గం    జగిత్యాల మార్చి 18(ప్రజా మంటలు)జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం  జిల్లా కలెక్టర్ మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అధ్యక్షులు  సత్య ప్రసాద్ ని మరియు  అదనపు కలెక్టరు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఉపాధ్యక్షులు బి ఎస్.లత ని మర్యాద పూర్వకంగా కలిశారు .    నూతనంగా...
Read More...
Local News  State News  Spiritual  

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు

ధర్మపురి పోలీసు ఠాణాలో వేంకటేశ్వరునికి పూజలు (రామ కిష్టయ్య సంగన భట్ల)   సాక్షాత్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన, కలియుగ దైవమైన ఏడు కొండల ప్రభువు శ్రీవేంకటేశ్వరుడే స్వయంగా పోలీసు రాణా వెళ్ళడం అరుదైన, అపురూప సంఘటన కాగా, రాష్ట్రంలో వేరెక్కడాలేని, మరెచ్చటనూ కానరాని విధంగా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనారసింహ, శ్రీవేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా, దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్థానిక పోలీసు స్టేష తమవద్దకు...
Read More...
Local News 

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత 

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ పోటీల ఆహ్వాన పత్రం పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లకు అందజేత    కరీంనగర్ మార్చి 18 (ప్రజా మంటలు) వికసిత్ భారత్ - యూత్ పార్లమెంట్ డిస్టిక్ లెవెల్ నోడల్ కళాశాలలో  రాష్ట్రస్థాయి ఎంపిక ప్రారం ప్రారంభోత్సవ సమావేశానికి హాజరుకావలసిందిగా మున్సిపల్ కమిషనర్ చాహత్  బాజ్ పాయి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్  గౌస్ ఆలం కు ఆహ్వాన పత్రిక  అందజేసారు .       స్థానిక శ్రీ రాజరాజేశ్వర   ....
Read More...
Local News  State News 

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత

విద్యార్థినులకు స్కూటీలు ఏవి ? బి అర్ ఎస్ నాయకుల నిలదీత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి.. మాట తప్పడం , మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం.. హైదరాబాద్ మార్చ్ 18: అన్ని వర్గాలను వంచించినట్టు విద్యార్థులను మోసం చేశారు.స్టేషన్ ఘన్పుర్ సభలో మేం ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ..డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు...
Read More...
Local News 

టీడీఎఫ్​ ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డికి సీఎస్​ఆర్​ అవార్డు

టీడీఎఫ్​ ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డికి సీఎస్​ఆర్​ అవార్డు సికింద్రాబాద్​ మార్చి 18 (ప్రజామంటలు) : తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరం( టీడీఎఫ్​ ​) ప్రెసిడెంట్​ మట్ట రాజేశ్వర్​రెడ్డి కి ప్రతిష్టాత్మక కార్పొరేట్​ సోషల్​ రెస్పాన్సిబిలిటీ( సీఎస్​ఆర్​ ) అవార్డుకు ఎంపికయ్యారు. గత 20 ఏండ్ల నుంచి తెలంగాణ  రాష్ర్టంలో వివిద రంగాల్లో అందించిన సేవలను గుర్తించిన సౌత్​ ఇండియా సీఎస్​ఆర్​ సమ్మిట్​ లో డూయింగ్​ గుడ్​...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన

గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ లో స్త్రీల భద్రతపై అవగాహన గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, జగిత్యాల్  డిఎస్పి రఘు చందర్ సూచనలతో, అఫేన్స్ అగైనేస్ట్ ఉమెన్, సైబర్ సెక్యూరిటీ మరియు రోడ్డు భద్రత గురించి ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి అవగాహన కల్పించారు.     ధర్మపురి సిఐ,రామ్ నర్సింహారెడ్డి  
Read More...
Local News 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

గొల్లపల్లి మండల ప్రాథమిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ  చేసినకలెక్టర్ బి.సత్య ప్రసాద్  గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళ వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ని  కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి కలెక్టర్ పరిశీలించారు.  ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగిఆర్యోగ...
Read More...
Local News 

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. గొల్లపల్లి మార్చి 18 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని లోత్తునూరు  మరియు వెల్గటూర్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో D-64, D-53, డిస్ట్రిబ్యూటరీ టైలింగ్ కెనాలను  సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కెనాల్ ఆవరణలోని ఉన్న పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని దాని...
Read More...
Local News 

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు

బీసీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంబరాలు జగిత్యాల మార్చి 18 (ప్రజా మంటలు)శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఆదేశాల మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో   సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, స్వీట్ల ను పంపిణీ...
Read More...
Local News 

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం

పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం భూపాలపల్లి మార్చి 18 (ప్రజామంటలు)  : భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని జెడ్పిహెచ్ఎస్ పెద్దతుండ్ల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు బి తిరుపతి మాట్లాడుతూ, భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన...
Read More...
Local News 

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం హనుమకొండ మార్చ్ 18 (ప్రజామంటలు) : కాకతీయ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద మంగళవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్...
Read More...