సామల వేణు కు గోల్డెన్ మెజీషియన్ అవార్డు
లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రధానం చేసిన ఎంపీ శ్రీభరత్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 24 (ప్రజామంటలు) :
తెలంగాణకు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికుడు సామల వేణుకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ( గోల్డెన్ మెజీషియన్ ) లభించింది. బీఎస్ రెడ్డి స్థాపించిన ఇండియన్ మ్యాజిక్ అకాడమీ (ఐఎంఏ) పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ మేజీషియన్ డే సందర్బంగా ప్రముఖ మెజీషియన్లు పీసీ సర్కార్ జూనియర్, సామల వేణులకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించారు. వైజాగ్ లోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది.
విశాఖ పట్నం ఎంపీ శ్రీభరత్, సెంచూరియన్ యూనివర్శిటీ ఛాన్సలర్ ఆచార్య జీఎస్‌ఎన్ రాజు లు సామల వేణు, పీసీ సర్కార్ జూనియర్ లకు గోల్డెన్ మెజీషియన్ అవార్డులను అందచేశారు. దేశ, విదేశాల్లో వేలాది ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహించిన సామల వేణు సేవలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్లు బీఎస్రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ శ్రీభరత్ సామల వేణును ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఇంకా కొన్ని చోట్ల ఉన్న మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు మెజీషియన్లు కృషి చేయాలని, సీనియర్ మెజీషియన్లు తమ ఆధ్వర్యంలో కొత్త మెజీషియన్లను తయారు చేయాలని ఎంపీ కోరారు. ప్రభుత్వం తరపున మెజీషియన్లకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు.
గర్వంగా, ఎంతో ఆనందంగా ఉంది: వేణు
45 ఏళ్ల తన అనుభవంలో 35 దేశాల్లో 7వేలకు పైగా ఇంద్రజాల ప్రదర్శనలిచ్చానని అవార్డు గ్రహీత సామల వేణు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ...సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో విద్యాబోధనకు అనుగుణంగా తెలుగు యూనివర్శిటీలో డిప్లొమా ఇన్ మ్యాజిక్ కోర్సును అందుబాటులోకి తెచ్చి ఏటా కనీసం 25మంది ఆ కోర్సును నేర్చుకుని, వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయగలిగానన్నారు. ఒక షో చేయాలంటే మేకప్, కాస్ట్యూమ్స్, లైటింగ్ ఇలా అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నది లేనట్టు..లేనిది ఉన్నట్టు భ్రమ కల్పించాలన్నారు. తాను ఈ వృత్తిలో ఇన్నాళ్లు మనగలిగానంటే అందుకు కుటుంబ సభ్యులతో పాటు అందరి సహకారం మరువలేనిదని, తన స్నేహితుడు బీఎస్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలన్నారు. ఇంద్రజాలికులకు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు.
మ్యాజిక్ చేయడంలో గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన పీసీ సర్కార్‌ను ఆదర్శంగా తీసుకునే తాను కూడా ఈ వృత్తిని ఎంచుకున్నానని వేణు తెలిపారు.జూనియర్ పీసీ సర్కార్ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం ఉందని, గతంలో తన ప్రదర్శనల్ని చూసి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వారెందరో మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. తనతో పాటు విశాఖలో పురస్కారాలందుకున్న సహచర మెజీషియన్లందరికీ వేణు అభినందనలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్
