నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
ఢిల్లీ డిసెంబర్ 16 ( ప్రజా మంటలు)
జగిత్యాలకు నవోదయ కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కలిశారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం నుండి నేషనల్ హైవే విస్తరణలో భాగంగా అంతర్గాం వద్ద హై లెవెల్ బ్రిడ్జి మరియు అండర్ పాస్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని తెలిపారు.
రాయికల్ మండలం బోర్నపల్లి జగన్నాథ్ పూర్ గ్రామాల మధ్యల బ్రిడ్జి ఏర్పాటు చేయాలని జగిత్యాల నుండి చలిగల్ సింగరావుపేట్ ఇటిక్యాల వెళ్ళే జాతీయ రహదారి లో లో లెవెల్ వంతెనలు ఉండడం వల్ల వర్షాలు కురిసిన సందర్భంలో ప్రజల రాకపోకలకు,రవాణా కు ఇబ్బందిగా మారిందని, నిజామాబాద్ జగదల్పూర్ జాతీయ రహదారి నేషనల్ హైవే అనంతారం గ్రామం వద్ద నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని, జగిత్యాల నుండి పోలాస రహదారిలో తిప్పన్నపేట పోలాస గ్రామాల మధ్యలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని దానిని బ్లాక్ స్పాట్ రోడ్డుగా గుర్తించి నిధులు మంజూరు చేసి డివైడర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
జగిత్యాల నియోజకవర్గ బీర్పూర్ మండలంలో గిరిజన ఆదివాసి బంజారాలు చాలా మంది ఉన్నారు కోమన్ పల్లి గ్రామంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని వినతి పత్రాన్ని ఇచ్చి కోరడం జరిగిందన్నారు.
సానుకూలంగా స్పందించిన ఎంపీ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తెలిపారు.