వరికొయ్యలను కాల్చవద్దు...భూ సారం దెబ్బతింటుంది

On
వరికొయ్యలను కాల్చవద్దు...భూ సారం దెబ్బతింటుంది

వరికొయ్యలను కాల్చవద్దు...భూ సారం దెబ్బతింటుంది

సికింద్రాబాద్​, నవంబర్​ 30 ( ప్రజామంటలు):

తెలంగాణ డెవల్మప్​మెంట్​ ఫోరం (టీడిఎఫ్) జై కిసాన్ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల  రైతులకు వరి కొయ్యలు కాలపెట్టొద్దంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే రైతులకు సింగల్ సూపర్ ఫాస్పేట్ తో పాటు  వేస్ట్ డీకంపోజర్ కిట్స్ లను  ఉచితంగా అందచేశారు. తెలంగాణ ప్రాంతంలో రైతులు వరి కొయ్యాలు కాలుస్తూ కాలుష్యానికి కారణం అవుతున్నారని, అదేవిధంగా వరి కొయ్యాల కాల్చడం వల్ల భూమి యొక్క సారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు.  అనేక సూక్ష్మజీవులు మరణానికి కారణం అవుతున్నాయని, దీనివల్ల భూమి తన యొక్క సారం పూర్తిగా కోల్పోవడం జరుగుతుందన్నారు. ఎప్పుడైతే భూమి సారం కోల్పోవడం జరుగుతుందో రైతులు అధిక దిగుబడి కోసం ఎక్కువ డీఏపి యూరియా బయటనుంచి కొనుగోలు చేసి, వాడుతున్నారన్నారు.  దీని వలన వ్యవసాయ పెట్టుబడి పెరిగి,  రైతులపై ఆర్థికభారం పడుతుందని విచారం వ్యక్తం చేశారు.  రైతులు తమ యొక్క పొలంలో వరి కొయ్యాలూ కాల్చుకోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల వేస్ట్ డీకంపోజర్స్ అదేవిధంగా సింగర్ సూపరేట్ ఫాస్పేట్ తో పొలంలో కలియబెడితే అది త్వరగా మురిగి ఎరువుగా మారుతుందని, తద్వారా భూమికి అనేక రకమైన పోషకాలు అందుతాయని తెలిపారు , రైతులు హార్వెస్టర్ తోని వరి కోసేటప్పుడు ఎంత వీలైతే అంత కింద నుంచి వరి కోయడం వల్ల వరి గడ్డి  పశువులకు ఉపయోగపడుతుందని తెలిపారు.  రైతులు కో–ఆపరేటివ్ సొసైటీ ద్వారా మార్కెట్లో లభించే ప్యాడి ట్రషర్ యంత్రాన్ని కొనుకొచ్చి దానిని పొడిగా మారిస్తే భూమి కూడా సారవంతం అవుతుందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల భూమి విషతుల్యంగా మారుతోందని, . తినే ఆహారంలో రసాయనిక ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. ఎన్నో వింతరోగాలతో మనుషులు ఆస్పత్రులపాలౌతున్నారు. చివరికి క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాల బారిన పడి మరణాలు సైతం సంభవిస్తున్నాయి. విరివిగా రసాయనిక ఎరువుల వాడకంతో భూమిలోని జీవరాసులు సైతం చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నేలతల్లిని కాపాడుకునేందుకు కొంతమంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందిస్తున్నారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుతూ ఇతర రైతులకు ఆదర్శంగా ఉండాలని రైతులను కోరారు, రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని  జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొండం రాజిరెడ్డి  విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో  పోత్కల్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి, వైస్ చైర్మన్ వెలుముల రామిరెడ్డి, మాజీ సర్పంచ్ కిషరావ్ , ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లా బాల్ రెడ్డి, గజ్జల రాజు,ముస్తాబాద్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అనూష, 16 గ్రామాలకు సంబంధించిన  అగ్రికల్చర్ ఎక్సెన్షన్ ఆఫీసర్స్ కీర్తన, సౌమ్య,రేవతి,అఖిల, వెంకటేష్,నరేష్, ముస్తాబాద్ మండల రైతులు పాల్గొన్నారు.

Tags