బాలిక వైద్య ఖర్చులకు 1.26 లక్షల ఆర్థిక సాయం ఫేస్ బుక్ మిత్రుల ఔదార్యం
బాలిక వైద్య ఖర్చులకు 1.26 లక్షల ఆర్థిక సాయం
ఫేస్ బుక్ మిత్రుల ఔదార్యం
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి నవంబర్ 30:
గత కొన్ని నెలల నుండి బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి వైద్య ఖర్చుల కోసం ఫెస్ బుక్ మిత్రులు 1.26 లక్షలు విరాళాలు అందించి తమ ఔధార్యాన్ని చాటారు.
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన గడేవార్ గజానన్ ఓ ప్రైవేట్ సంస్థలో చిరు ఉద్యోగం చేస్తూ, అద్దె ఇంట్లో నివాసం ఉంటూ భార్య, కూతురుని పోషిస్తున్నాడు.
తమ 9 సంవత్సరాల ఏకైక కూతురు జాగృతి కొన్ని నెలల నుండి బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నది . వైద్య ఖర్చుల కోసం గజానన్ తనకు ఉన్న చిన్న స్థలాన్ని సైతం విక్రయించాడు. అయినప్పటికీ వైద్యం కోస తీవ్ర ఇబ్బందులు పడుతుండగా విషయం తెలుసుకున్న ధర్మపురి కి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి నవంబర్ 3 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
దాతలు స్పందించి బాలిక తండ్రి గజానన్ బ్యాంకు ఖాతాకు రూ. 1.26 లక్షలు విరాళాలు అందించారు. వాటిని రమేష్ మంచిర్యాల ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్ చేతుల మీదుగా బాలిక తండ్రికి పంపిణీ చేయించాడు.