సైబర్​ క్రైం లపై స్టూడెంట్లకు అవెర్​నెస్ 

On
సైబర్​ క్రైం లపై స్టూడెంట్లకు అవెర్​నెస్ 

సైబర్​ క్రైం లపై స్టూడెంట్లకు అవెర్​నెస్ 

సికింద్రాబాద్​ నవంబర్​ 30 (ప్రజామంటలు) :

రోజు, రోజుకి పెరిగిపోతున్న సైబర్​ క్రైం లతో చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, సైబర్​ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ప్రతి ఒక్కరు సైబర్​ క్రైం లపై అవగాహన పెంచుకొని, జాగ్రత్తగా ఉండాలని పలువురు వక్తలు సూచించారు. శనివారం వారాసిగూడ లోని శ్రీబాలాజీ హైస్కూల్​ లో హైదరాబాద్​ సిటీ సెక్యూరిటీ  కౌన్సిల్​ ఆధ్వర్యంలో సైబర్​ సెక్యూరిటీపై అవెర్​నెస్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​సిటీ సెక్యూరిటీ కౌన్సిల్​ అసోసియేట్​ డైరెక్టర్​ సీమా సిక్రి, చిలకలగూడ ఏసీపీ జైపాల్​ రెడ్డి, వారాసిగూడ ఇన్​స్పెక్టర్​ సైదులు, హెడ్మాస్టర్​ సుదేశ్​ లు స్టూడెండ్లకు సైబర్​ నేరగాళ్ళ ట్రాప్​ లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మొబైల్​ లో వచ్చే లింక్​ లపై క్లిక్​ చేయవద్దని, ఓటీపీ లను అనుమానిత వ్యక్తులకు షేర్​ చేయకూడదని, పాస్​ వర్డ్​ లను ప్రొటెక్ట్ చేసుకోవాలని కోరారు. తరచుగా వచ్చే స్పామ్​ కాల్స్​ కు రెస్పాండ్​ కాకుండా వాటిని బ్లాక్​ లో ఉంచాలని, ఏదేని కాల్​, సైట్​ లపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్​ క్రైమ్​ జరిగిన వెంటనే 1930  కు డయల్ చేసి, రిపోర్ట్​ చేయాలని  సూచించారు. ఇది రౌండ్​ ఏ క్లాక్​ పనిచేస్తుందని చెప్పారు. సైబర్​ క్రైమ్​ లపై తాము అవగాహన పెంచుకోవడమే కాకుండా ఇంట్లోని వారికి, ఇతరులకు స్టూడెంట్లు ఈవిషయమై ఎడ్యుకేట్​ చేయాలని కోరారు. 
–––––––––––

Tags