రైతు పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - మార్కెట్ కమిటీ చైర్మన్
రైతు పండగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి - మార్కెట్ కమిటీ చైర్మన్
ధర్మపురి నవంబర్ 29:
వ్యవసాయ మార్కెట్ కమిటి ధర్మపురి యార్దు నందు మార్కెట్ కమిటి చైర్ పర్సన్ శ్రీమతి చిలుముల లావణ్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు పండగ కార్యక్రమమును అమిస్తాపూర్, మహబూబ్ నగర్ జిల్లా నందు ఏర్పాటు చేయడం జరిగిందని నవంబర్ 28,29 మరియు 30 తేదీలలో వ్యవసాయ ప్రదర్శనలు మరియు 30వ తేది సాయంత్రం 4.00 గం.లకు రైతు పంగడ మహాసభ నిర్వహించబడునని తెలిపారు.
ఈ మహా సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారని కావున రైతులు ఇట్టి మహా సభని విజయవంతం చేయాలనీ తెలిపారు. తదుపరి మాట్లాడుతూ ధాన్యం ఉత్పత్తిలో దేశంలో ప్రధమ స్థానంలో మన తెలంగాణ ఉందని ధర్మపురి నీయోజికవర్గంలో ఇప్పటికే 80% రైతులకు రైతులకు ఇప్పటికే ఋణ మాఫీ చేసి, ఆనందాలు పంచాం అని మిగిలి 20% రైతులకు ఋణ మాఫీ అయ్యేవిధముగా ధర్మపురి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకవేళ్ళరని తెలిపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు తమ ధాన్యాన్ని విక్రయిoచాలని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నరకలకు రూ.,500 బోనస్ కూడా రైతులకు జమ చేయడం జరిగిందని రైతులు ధలరిలను నమ్మి మోసపోవద్దని తెలిపారు కావున రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతు బరోస కూడా త్వరలో జమ చేయడం జరుగుతుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతుల సంక్షేమం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం సాయ శక్తుల కృషి చేస్తుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సంబంధిత అధికారులు పని చేయాలని తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటిలో పని చేస్తున్న హమలిలకు మరియు చాట వారికి యునిఫాంలు దుస్తులు పంపిణి చేసారు. ఇట్టి సమావేశములో వైస్ చైర్మన్ సంగ నర్సింహులు మరియు పాలకవర్గ సభ్యులు గంధం రాజయ్య, శ్రీమతి వాంకుదోత్ గీతాంజలి, MD.రాఫియోదిన్,ఎన్నం మధుకర్ రెడ్డి,ఏనుగు జోగి రెడ్డి,రామడుగు రవి, దైతా శ్రీనివాస్ గారు మరియు మార్కెట్ కార్యదర్శి మైలారపు భూమన్న, సిబ్బంది పాల్గొన్నారు.