జ్యోతిబా పాఠశాలలో ఆటలాడుతుండగా అస్తమా బాలిక పడిపోవడంతో షాక్ కు గురైన బాలికలు

On
జ్యోతిబా పాఠశాలలో ఆటలాడుతుండగా అస్తమా బాలిక పడిపోవడంతో షాక్ కు గురైన బాలికలు

జ్యోతిబా పాఠశాలలో ఆటలాడుతుండగా అస్తమా బాలిక పడిపోవడంతో షాక్ కు గురైన బాలికలు 

గొల్లపల్లి ఆగస్టు 13 (ప్రజా మంటలు) :
గొల్లపెల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మహాత్మ జ్యోతిబాపూలే గర్ల్స్ పాఠశాలలో మంగళవారం సాయంత్రం బాలికలు కోకో ఆడుతుండగా శ్రీజ పదవ తరగతి అమ్మాయి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆమెతో ఉన్నటువంటి బాలికలు భయానికి లోనైనారు.ఆమెతో పాటు రిశీత,,శ్రావ్య,,భవ్యశ్రీ,,అమిత లు కూడా షాక్ కు గురికాగా వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పలు రకాల అపోహలు వస్తున్నాయి.
ఫుడ్ పాయిజన్ అయిందని పలువురు భావిస్తున్నారు. వాస్తవానికి 15 ఆగస్టు కోసమని ఆటల  పోటీలు నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా కోకో ఆడుతుండగా  శ్రీజ అనే బాలిక తోటి విద్యార్థులతో ఆడుచుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సంబంధిత పాఠశాల వైస్ ప్రిన్సిపల్ తెలుపుతున్నారు.
శ్రీజకు గతంలో ఇలాంటి ఘటన జరిగినట్లు డాక్టర్ల సూచన మేరకు నాజిల్ స్ప్రే వాడుతుందని మంగళవారం రోజు నాజిల్స్ స్ప్రే అందుబాటులో లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తోటి విద్యార్థులు తెలుపుతున్నారు. శ్రీజ కు ఇటీవల ముక్కులో అదనపు కొవ్వు పేర్కోవడంతో ఆపరేషన్ జరిగినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రిన్సిపల్ సుస్మిత ఇటీవలే జిల్లా గురుకులాలకు కన్వీనర్ గా నియామకం కావడంతో ఉప ముఖ్యమంత్రి పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు మంగళవారం విచ్చేసిన సందర్భంగా ప్రిన్సిపల్ సుస్మిత తన బాధ్యత రిత్యా అక్కడికి వెళ్లినట్లు సమాచారం. జిల్లా ఉపవైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ 108 వాహనం ద్వారా అక్కడి స్టాఫ్ నర్స్ సుమలత విద్యార్థులను ఆసుపత్రికి తీసుకువచ్చారని వైద్య బృందం పరీక్షలు నిర్వహించినామని హార్ట్ బీటింగ్ నార్మల్ గా ఉందని లంగ్స్ క్లియర్ గా ఉన్నాయని ఆటల్లో ఒత్తిడికి గురైనప్పుడు ఆయాసం జరిగి ఇలాంటి ఘటన చోటుచేసుకునే అవకాశం ఉంటుందని ప్రస్తుతానికి ఆరోగ్యం అందరిదీ  నిలకడగా ఉందని తెలియజేశారు పూర్తి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు
*పాఠశాలలో జరిగిన ఘటనతో సమాచారం అందుకున్న పేరెంట్స్ తమ తమ పిల్లలను ఇండ్లకు తీసుకువెళ్లారు*
Tags