సిపిజెట్ ఫలితాలలో ఎన్ ఎస్ వి కి  స్టేట్ ఫస్ట్ ర్యాంక్

On
సిపిజెట్ ఫలితాలలో ఎన్ ఎస్ వి కి  స్టేట్ ఫస్ట్ ర్యాంక్

సిపిజెట్ ఫలితాలలో ఎన్ ఎస్ వి కి  స్టేట్ ఫస్ట్ ర్యాంక్
జగిత్యాల ఆగస్ట్ 11 (ప్రజా మంటలు) :
స్థానిక ఎన్ఎస్వి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బీఎస్సీ బి జెడ్ సి విభాగంలో డిగ్రీ పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీ వారు ప్రకటించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలలో జువాలజీ విభాగంలో కొండ బత్తిని సాత్విక స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్, సాధించారు అలాగే జంగిలి పావని స్టాటస్టిక్స్ విభాగంలో స్టేట్ 19వ ర్యాంక్ మరియు ఎం కం మ్యాథమెటిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాలలో  ఏడుగురు విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంకులు సాధించారు.
రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పట్టభద్రుల ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి  ప్రత్యేకంగా అభినందిస్తూ జగిత్యాల లాంటి గ్రామీణ ప్రాంతంలో ఉత్తమ విద్యను అందించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం అనేది జగిత్యాల జిల్లాకే గర్వ కారణం గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి రాష్ట్రస్థాయి ర్యాంకులకు వేదికగా  నిలుస్తున్న ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాల అధ్యాపక బృందాన్ని మరియు కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు, ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఇలాంటి విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ముందు నుండే ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఉత్తమ ర్యాంకులు సాధించాలని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ  మాట్లాడుతూ డిగ్రీ మొదటి సంవత్సరం నుండి డిగ్రీ విద్యతో పాటుగా పీజీ ఎంట్రెన్స్ లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ శిక్షణ అందించడం ద్వారా ఇలాంటి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగిందని తెలుపుతూ ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్కే అండ్ ఎన్ ఎస్ వి విద్య సంస్థల చైర్మన్ యాద రామకృష్ణ,  అకాడమిక్ డైరెక్టర్ శ్రీపాద నరేష్  మరియు ప్రిన్సిపల్ గోపు మునిందర్ రెడ్డి  అధ్యాపక బృందం పాల్గొన్నారు

Tags