పూడూరు హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

On
పూడూరు హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

పూడూరు హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

జగిత్యాల ఆగస్టు 09:  

పూడూరు మండల కేంద్రంలో జరిగిన కందుల రాజశేఖర్  హత్య కేసులో ఇద్దరు నిందితులు మామిడి కమల్,
చిలివేరి తిరుపతి లను  పూడూరు గ్రామ శివారులో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.  
               
    నిందితులు, మృతుడు ఇద్దరూ పూడూరు గ్రామానికి చెందినవారు మరియు దగ్గరి దగ్గరి ఇండ్లలో నివసిస్తారు. గత కొంత కాలము నుండి మృతుడికి, నిందుతుడు మామిడి కమల్ కు మాటలు లేవు.  గడ్డి కోసేందుకు పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామానికి వెళ్లారు. అయితే అయితుపల్లి గ్రామానికి రాగానే వర్షం రావడంతో గడ్డి కోయకుండా వెనుదిరిగారు. ఈ సమయంలో,  పుడూరు గ్రామ సమీపంలోని బీరప్ప ఆలయానికి సమీపంలో మద్యం సేవించడానికి వెళ్ళగా అక్కడికి మృతుడు వచ్చి వారితో మద్యం సేవించినాడు. కొద్ది సేపటి తర్వాతా ఇంకా బీర్లు కావాలని మృతుడు తన జేబులోని ఎటిఎం కార్డు ని నిందితునికి ఇచ్చి దాని పిన్ నెంబర్ చెప్పి వెళ్లి బీర్లు తీసుకు రమ్మని  చెప్పినాడు. పుడూరు గ్రామంలో కి వెళ్లి మునిందర్ రెడ్డి బెల్ట్ షాప్ లో రెండు బీర్ లు తీసుకొని 360/- రూ లు తన గూగుల్ పే నుండి డబ్బులు చెల్లించి, బీరప్ప ఆలయానికి వెళ్లి ,  అక్కడ సిమెంటు నేలపై మృతుడు మరియు రెండవ నిందితుడు తిరుపతితో కలిసి కూర్చుని మద్యం సేవించారు. కొద్దిసేపటి తర్వాతా అక్కడ ఎవరు లేని సమయంలో మృతుడు పాత విషయాలు తీసి మాట్లాడుతుండగా, నిందితుడు పాత విషయాలు ఎందుకు తీస్తున్నావని అడగడం తో ఇద్దరి మద్య గొడవ జరిగింది. ఇట్టి గొడవలో మృతునీ నిందితుడు  కర్రతో కొట్టడం తో మృతుడు కింద పడి, నెట్టి వేసినాడు. తర్వాత వెంటనే రెండవ నిందితుడు  మరణించిన వ్యక్తిని తలపై కర్రతో పలుమార్ల కొట్టాదాని పోలీసులు తెలిపారు.   మృతుడి స్కూటీ సీటు తెరిచి పెట్రోల్ బాటిల్ తీసుకుని సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతుడి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 
 జగిత్యాల డిఎస్పి రఘుచంధర్  సూచనలతో  కేసు ను త్వరగా చేదించి, నిందితులను పట్టుకున్న  మల్యాల సిఐ నీలం రవి,  కోడిమ్యాల ఎస్సై సౌడం సందీప్ మరియు ఇతర సిబ్బందిని  జగిత్యాల జిల్లా ఎస్పి  ఆశోక్ కుమార్    అభినందిచారు.

Tags