క్విట్ ఇండియా దినోత్సవం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

On
క్విట్ ఇండియా దినోత్సవం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

 క్విట్ ఇండియా దినోత్సవం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

- నాటి ఉద్యమ వీరులను స్మరించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. - కవ్వంపల్లి సత్యనారాయణ


*క్విట్ ఇండియా దినోత్సవం పురస్కరించుకొని  కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ  హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ   మాట్లాడుతూ..క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 లో మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం.ఈ ఉద్యమంలో ఆనాటి ఎంతో మంది గొప్ప నాయకులు పౌరులు పాల్గొని స్వాతంత్ర ఉద్యమానికి పునాది వేయడం జరిగిందను అన్నారు 

ఈ ఉద్యమంలో మహాత్మా గాంధీ తన ప్రసంగంలో "డూ ఆర్ డై" అని పిలుపునివ్వడం జరిగింది.క్విట్ ఇండియా ఉద్యమ చరిత్రను నేటికీ ఈ దేశ ప్రజలు  గుర్తించడం వెనక కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర ఉందని, ఈ సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేసి క్విట్ ఇండియా దినోత్సవంలో పాల్గొన్న త్యాగ వీరులను స్మరించుకోవడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్, నాయకులు మాచర్ల ప్రసాద్, మల్యాల సుజిత్ కుమార్, కల్వల రామ్ చందర్, ముస్తాక్ అహ్మద్, పులి ఆంజనేయులు గౌడ్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మడుపు మోహన్, విక్టర్, లింగంపల్లి బాబు, హైమాద్ అలీ, కుర్రపోచయ్య, వెన్నం రజిత రెడ్డి, దన్నసింగ్, కామ్రెడ్డి రాంరెడ్డి, వంగల విద్యాసాగర్, మాలోతు మహాలక్ష్మి,హస్తపురం తిరుమల, మాదాసు శ్రీనివాస్, పర్వత మల్లేశం, హస్తపురం రమేష్ , పోరండ్ల రమేష్, కుంభాల రాజ్ కుమార్, అజీమ్, షబానా మహమ్మద్, షహిన్షా, నెల్లి నరేష్ ,పెద్ది గారి తిరుపతి, రాచర్ల పద్మ ,హనీఫ్, కొట్టే కోల ప్రభాకర్, గంగుల దిలీప్ కుమార్, మంద మహేష్, లైక్, చోటు, కలీం, శిల్పా, జొన్నల రమేష్, చింతల కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Tags