మంథని నియోజకవర్గంలో ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన

On
మంథని నియోజకవర్గంలో ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన

మంథని నియోజకవర్గంలో ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన

మంథని జూలై 03:

ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు మల్హర్, కాటారం, మహాదేవపూర్ మండలాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

👉జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

👉మహదేవ్పూర్ మండలంలో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు,

👉 జాతీయ రహదారి నుండి కుదురుపల్లి వరకు 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణానికి

👉 40 లక్షల రూపాయలతో శివాజీ చౌక్ నుండి హనుమాన్ గుడి వరకు నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

3.50 లక్షలతో నిర్మించిన శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు సమీకృత మండల కార్యాలయ సముదాయ భవనాన్ని ప్రారంభించారు

👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్క్ 8.50 లక్షలు తో ప్రారంభించడం జరిగింది

 👉ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు స్మారక విగ్రహం ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు‌ 

అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. 

జిల్లాలో ఈ సంవత్సరం 26.129 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు, మొక్కలు పెంపకంతో పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని కాలుష్యం నుండి ప్రజలకు రక్షణ కలుగుతుందని అన్నారు.

👉మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని వాటి ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పేర్కొన్నారు.

 చెట్లను పెంచడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని మనిషి ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన జీవనయానం సమకూర్తుందని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో డిఆర్డిఓ నరేష్, జడ్పి సీఈవో విజయలక్ష్మి, అదనపు డిఆర్డీవో పసుమతి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..

Tags