హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
హాస్టల్ లను సందర్శించిన మండల ప్రత్యేక అధికారి సాయిబాబా
గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని జ్యోతిరావు పులే, మోడల్ స్కూల్, గర్ల్స్ గురుకుల స్కూల్ ,హాస్టల్ లను మండల ప్రత్యేక అధికారి సాయి బాబా సందర్శించారు, ఈ సందర్భంగా పిల్లలకు ప్రతిరోజు సరఫరా చేయుచున్న మధ్యాహ్న భోజనాన్ని ప్రత్యేక అధికారి పరిశీలించి అక్కడే మధ్యాహ్న భోజనం పిల్లలతో కలిసి భోజనం చేసి యొక్క నాణ్యతను పరిశీలించారు.
హాస్టల్ పరిసరాలను హాస్టల్ గదులను పరిశీలించి వాటి యొక్క శుభ్రత ను పరిశీలించారు, హాస్టల్ పిల్లలకు సరఫరా చేయుచున్న భోజనము నాణ్యత బాగానే ఉన్నట్టు గుర్తించారు, మహాత్మా జ్యోతి పులే హాస్టల్లో కూడా సందించి హాస్టల్ పరిసరాల ప్రాంతంలో నీరు నిలిచి ఉన్న ప్రాంతంలో ఆయిల్ బాల్స్ గ్రామపంచాయతీ సిబ్బందితో వేయడం జరిగింది
కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ రామ్ రెడ్డి ,ఎంపీ డిఓపి పి సురేష్ రెడ్డి, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.