తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది ని అభినందించిన  ఎమ్మెల్యే  

On
 తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది ని అభినందించిన  ఎమ్మెల్యే  

తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది
ని అభినందించిన  ఎమ్మెల్యే  
- మెడికల్ హబ్ గా జగిత్యాల

  -ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలి
-ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల సెప్టెంబర్ 05 (ప్రజా మంటలు):
జిల్లా కేంద్రంలో మాతా శిశు ప్రభుత్వాసుపత్రి ని ఆకస్మికంగా సందర్శించి,పిల్లల, కంటి వార్డులని  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరిశీలించారు.
ఆసుపత్రి సందర్శనలో భాగంగా జగిత్యాల మండలం కి చెందిన మహిళ ప్రసూతి సమయంలో అనారోగ్యం తో బాధపడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా  సంబంధిత వైద్యలు వారి సిబ్బంది మెరుగైన చికిత్స అందించి తల్లి పిల్లల ప్రాణాలు కాపాడగా,పిల్లల వార్డులో శిశువు ను పరిశీలించి,ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకునీ  వైద్యులను, వారి సిబ్బందిని సేవలను  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అభినందించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం పై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, మెడికల్ హబ్ గా జగిత్యాల మారనుందని అన్నారు. 

వెంటిలేటర్ పై ఉన్న తల్లి ఆరోగ్యం బాగుందని, 1 కేజీ 500 గ్రాముల పాప జన్మించింది,పాప ఆరోగ్యం సైతం భాగింది,వైద్యులు పాపకు ఆక్సీజన్,ఫ్లుయిడ్స్ ఇస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల కారణంగా బెడ్లు సరిపోని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

జగిత్యాల జిల్లా పరిసర ప్రాంత ప్రజలతో మాట్లాడగా వైద్య సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారనీ ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీ గా ఉన్న వైద్య పోస్టు ల నియామకం పై  డి ఎం ఈ తో ఫోన్ లో మాట్లాడగా, వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే అన్నారు.

10 కోట్ల తో క్రిటికల్ కేర్ యూనిట్ ని సైతం ఏర్పాటు చేస్తున్నాం.త్వరలో ప్రారంభిస్తమన్నారు.

జగిత్యాల జిల్లా పజలకు మెరుగైన చికిత్స అందించేందుకు తనవంతుగా కృషి చేస్తా.. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భం గా ప్రజలను కోరుతున్న అన్నారు. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డా.రాములు, హెచ్ ఓ డి అరుణ, ఆర్ఎం ఓ యాకుబ్ పాషా,డా.గీతిక,నాయకులు బోనగిరి నారాయణ,భూపెళ్లి శ్రీనివాస్,శేఖర్,
వైద్యులు,పారామెడికల్ స్టాఫ్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Tags