కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి ఎప్రిల్ 03 (ప్రజా మంటలు):
జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం పెగడపెల్లి మండలం నంచర్ల నుండి దేవికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు నిర్వహించిన పాదయాత్రలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.గత కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్ర మంత్రి గా వ్యవహరిస్తున్న అమీషా రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగాఖండిస్తున్నామని,వారిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనిడిమాండు చేశారు.
ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ఈ విధంగా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ప్రతి గ్రామ గ్రామాన తెలిపే విధంగా జై బాపు,జై భీం,జై సంవిధాన్ అనే నినాదంతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందనీ,దీన్నీ బట్టి బీజేపీ పార్టీ అణచివేత ధోరణి,కుటిల బుద్ధి బయటపడిందని,అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు మోడీ గారు,ప్రధానమంత్రి కుర్చీలో అమిత్ షా హోం శాఖ కుర్చీలో కూర్చున్నారన్న విషయం మర్చిపోవద్దని,నేను ఒక ఎమ్మెల్యేగా,విప్ గా హోదాలో కొనసాగుతున్న అంటే దానికి అంబేద్కర్ పెట్టిన బిక్ష అని,అమిత్ షా పైన చర్యలు తీసుకొని వారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేంత వరకు పాదయాత్ర మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళా సంఘాలకు కేంద్రం 15 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బౌద్దనగర్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం

మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర

ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు

అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన

శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన డీఎస్పీ రఘు చందర్

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఆహ్వానం

ఆడబిడ్డ పెళ్లికి వెండి ఆభరణాల బహుకరణ

కిమ్స్ -సన్‌షైన్ హాస్పిటల్ -లో రీనల్ డెనర్వేషన్ థెరపీ సెంటర్ ఏర్పాటు

బార్ అసోసియేషన్ నాయకులకు సన్మానం

దమ్ముంటే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల పై అధికారులతో కలెక్టర్ సమావేశం
