యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
కరీంనగర్ 15 మార్చి (ప్రజా మంటలు) :
కరీంనగర్ జిల్లా మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్తంగా నోడల్ యూత్ పార్లమెంట్ కి నోడల్ కళాశాలగా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయంప్రతిపతి కరీంనగర్ ఎంపిక కావడం ఆనందంగా ఉందని, 25 సంవత్సరాల లోపు యువకులు ఎక్కువ మొత్తంలో మై భారత్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని వికసిద్భారత్ 2047 వికసిత్ భారత్ 2047 అంటే ఏమిటి భారతదేశ 2047 వరకు ఏ విధంగా ఉండాలి, అభివృద్ధి చెందిన దేశంగా, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆర్థిక రంగం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే దిశగా, అద్భుతమైన విదేశాంగ విధానం, రక్షణ రంగం, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మహిళా సాధికారత దిశగా, విద్యారంగంలో, వైద్యరంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడానికి యువత ఏమి చేయాలి.
దేశం ఏ స్థితిలో ఉండాలి అనే అంశాలను ఆధారంగా ఒక నిమిషం పాటు వీడియోను రికార్డ్ చేసి మైభారత్ పోర్టల్ ద్వారా అప్లోడ్ ఈనెల 16వ తారీకు వరకు చేయాల్సిందిగా యువతకు కేంద్ర సహా మంత్రి బండి సంజయ్ గారు సూచించారు.
ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ నోడల్ కళాశాల అధిపతి ఆదేశానుసారం నోడల్ కళాశాల ఇన్చార్జి డాక్టర్ బి ఎలిజిబెత్ రాణి నోడల్ కళాశాల వికసిత్ భారత్ సభ్యులు, డాక్టర్ పడాల తిరుపతి, డాక్టర్ కాంపల్లి అర్జున్, డాక్టర్ రాజేశం, డాక్టర్ రాపర్తి శ్రీనివాస్ మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బండి సంజయ్ సమక్షంలో వికసిత్ భారత్ గోడపత్రికను ఆవిష్కరింపజేశారు.
ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ.... వీళ్ళందర్నీ స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక జరుగుతుందని తర్వాత ఈ 2 జిల్లాల నుండి ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో తేదీ 21, 22 తేదీలలో 150 మంది విద్యార్థులకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సేవింగ్ ది వే ఫర్ వికసిద్భారత్ అనే అంశంపై మూడు నిమిషాలు మాట్లాడాలని, యువత ఈ గొప్ప అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకుని మన దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పేర్కొన్నారు.
యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వివిధ కళాశాలల అధ్యాపకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, విద్యాలయ ఉపకులపతి, రిజిస్ట్రార్, నెహ్రూ యువ కేంద్ర అధికారులు ఇతర అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు ఈ పోటీల గురించి యువతకు అవగాహన కల్పించి ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కేంద్ర సహా మంత్రి బండి సంజయ్ గారు సూచించారు.
సందేహాల కోసం ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు
- డాక్టర్ బి ఎలిజిబెత్ రాణి(9963711626),
- డాక్టర్ పడాల తిరుపతి(9440933848),
- డాక్టర్ కాంపల్లి అర్జున్(8247413438),
- డాక్టర్ రాజేశం(7337567386),
- డాక్టర్ రాపర్తి శ్రీనివాస్(6300382718) గార్లను సంప్రదించవలసిందిగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం

లైంగిక వేదింపులు కేసులో ఇద్దరికీ 2 నెలల జైలు శిక్ష
.jpeg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

మహిళా మంత్రిగా మహిళలకు అన్యాయం చేయడం తగదు

ధర్మపురి స్వామివారి హోమశాలలో బ్రహ్మోత్సవ హవనాలు

విద్యకు బడ్జెట్ లో15 శాతం నిధులను కేటాయించాలి - ఎబివిపి

మహిళలకు మోసం చేశామని స్వయంగా ప్రభుత్వం అంగీకరించడం సిగ్గుచేటని కవిత విమర్శ

దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందజేత
.jpg)
భయం వీడితే విజయం మనదే...

సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.. గాంధీ డాక్టర్లకు హెచ్చరిక

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వార్షికోత్సవ, కళ్యాణ కరపత్రికను ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత
.jpg)