కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు
కొండగట్టు మార్చి 12( ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవ త్రయానీకము సోమవారం
ఘనంగా ముగిసింది. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణం, అభిషేకాలు నిర్వహించి స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పుణ్యాహవచనం, దివ్య మహా మంగళహారతి నిర్వహించగా, ఆలయ ప్రాంగణం భక్తిరసమయమైంది.
ఈ పవిత్రోత్సవాలు ఆలయ శుద్ధి, దోష పరిహారం, భక్తుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమాలు సజావుగా కొనసాగాయి.
ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని, తమ మొక్కులు తీర్చుకున్నారు. ముగింపు కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ
మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన పవిత్రోత్సవ త్రయాణికము ఘనంగా ముగిసాయని తెలిపారు .ఈ పవిత్రోత్సవాల త్రయనీకము నిర్వహిస్తారు. తద్వారా ఆలయ పవిత్రత పున సంతరించుకుంటుందని భక్తుల కోరికలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి అని కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కహానికము అనంతరం వేద పూజ అగ్ని హోమం మంత్రపుష్పం జంజవాభిషేకం అర్చన పవిత్రికరణ ప్రత్యేక పూజలు నిర్వహించమని తెలిపారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి

బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ పర్యటన

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

జగిత్యాల పట్టణ ఆవోపా ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

భయం వీడితే...జయం మనదే..
.jpg)
మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు ..... కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*
