ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్,
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్)
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సత్ప్రవర్తన తో కూడిన విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాల అధిరోహించాలని కోరారు.
ఈ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఘనమైన కీర్తిని ఈ కళాశాలకు అందించారని మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాశాలగా పేరు నిలబెట్టారని కొనియాడారు. మంచి నైపుణ్యత కలిగిన అధ్యాపక బృందం మన కళాశాలలో ఉందని,మంచి ప్రశాంతమైన వాతావరణంతో కళాశాల ప్రాంగణం ఉందని తెలిపారు. పూర్వ విద్యార్థులాగానే ఈ బ్యాచ్ విద్యార్థులు కూడా సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకొని మంచి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
మన జీవితం మన చేతిలోనే ఉందని తెలియజేస్తూ విద్యార్థుల అందరూ కూడా ఉన్నత స్థితికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
.jpg)
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

#Draft: Add Your Title

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో మాజీ మంత్రి రాజేశం గౌడ్

ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.
