ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్,
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు - దగ్గుల అశోక్)
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం రోజున సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సత్ప్రవర్తన తో కూడిన విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత శిఖరాల అధిరోహించాలని కోరారు.
ఈ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎంతో ఘనమైన కీర్తిని ఈ కళాశాలకు అందించారని మంచి మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాశాలగా పేరు నిలబెట్టారని కొనియాడారు. మంచి నైపుణ్యత కలిగిన అధ్యాపక బృందం మన కళాశాలలో ఉందని,మంచి ప్రశాంతమైన వాతావరణంతో కళాశాల ప్రాంగణం ఉందని తెలిపారు. పూర్వ విద్యార్థులాగానే ఈ బ్యాచ్ విద్యార్థులు కూడా సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకొని మంచి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
మన జీవితం మన చేతిలోనే ఉందని తెలియజేస్తూ విద్యార్థుల అందరూ కూడా ఉన్నత స్థితికి ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్

బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా

బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్

దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ

పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
.jpg)
అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య
