ఘనంగా కొనసాగుతున్న శ్రీమద్ భాగవత సప్తాహ మహోత్సవం
మానకొండూరు మార్చి 24( ప్రజా మంటలు)
మండలంలోని గంగిపల్లి గ్రామంలో గోపాల మురళీకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఘనంగా భాగవత సప్తాహ మహోత్సవం సోమవారం 4 వరోజుకు చేరుకుంది. అభినవ శుఖ, పురాణ వాచస్పతి, శ్రీమాన్ శ్రీ నంబి వేణుగోపాల ఆచార్యచే ప్రవచనామృతం సాగింది. ప్రతి మనిషికి ఆనందం ముఖ్యమని లౌకిక ఆనందం తాత్కాలికం మాత్రమేనని నిజమైన ఆనందం భాగవత ప్రవచనం ఆలకించడము ద్వారానే అనుభవము పొందగలుగుతారని అన్నారు
.రాయప్రొలు సుబ్రహ్మణ్య శర్మ వాయొలిన్ ,రాగెళ్ల నాగభూషణం మృదంగం వాద్య సహకారం తో ఆసాంతం వీనుల విందుగా కొనసాగింది. నేటి నుండి మళ్ళి 28వ తేదీ శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు,తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి 7 గంటల వరకు ఈ ప్రవచనం సాగుతుందని వైదిక నిర్వాహకులు జ్యోతిష్య వాస్తు పండితులు నమిలకొండ రమణాచార్యులు తెలియపరిచారు..
వంగపెల్లి సావిత్రమ్మ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు మరియు పండితులు రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి, బ్రహ్మశ్రీ సిరిసిల్ల. రామ శర్మ ,నమిలకొండ రఘు రామాచార్యులు మొదలగు పండితులు పాల్గొన్నారు.
పలు ప్రాంతంల నుంచి వచ్చిన భక్త జనబృందం భాగవత కథామృతాన్ని శ్రవణం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు, కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదం అందజేశారు. అన్నదానం ఉంటుందని చక్కగా కథ శ్రవణాన్ని చేయాలని నిర్వాహకులు తెలియపరిచారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
