రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సౌజన్యంతో ఇఫ్తార్ విందు
జగిత్యాల మార్చి 25(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రములో మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ పవిత్ర మాసం సమాజంలో ఒకరినొకరు గౌరవించుకునే స్ఫూర్తిని, సహనం, సహాయసహకారాలను పెంపొందించే గొప్ప సమయమని పేర్కొన్నారు.
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని, ఇఫ్తార్ విందుల వంటి కార్యక్రమాలు సామాజిక సమైక్యతకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , ఆర్డీవో శ్రీనివాస్ , కలెక్టరేట్ పరిపాలన అధికారి హకీమ్ గారు TRESA అధ్యక్షుడు ఎండి వకీల్, TNGO జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు మరియు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
