స్కౌట్స్ ఆండ్ గైడ్స్ తో చిన్ననాటి నుంచే క్రమశిక్షణ
ఘనంగా వరల్డ్ థింకింగ్ డే - బెడెన్ పావెల్ జయంతి )
సికింద్రాబాద్ ఫిబ్రవరి 22 (ప్రజామంటలు):
స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణలో చిన్ననాటి నుండి క్రమశిక్షణను అలవరచడం ఏంతో అభినందనీయమని, చిన్ననాటి నుండి క్రమశిక్షణతో ఉంటే భవిష్యత్తులో పెద్దవారైన తరువాత మంచిగా ఉంటూ పోలీసులకు పని తక్కువ చేసిన వారవుతారని రాంగోపాల్ పేట పోలీస్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుల జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే థింకింగ్ డే ( ఆలోచనా దినోత్సవాన్ని ) ను శనివారం సర్దార్ పటేల్ రోడ్డులోని భారత్ స్కౌట్స్ ఆండ్ గైడ్స్ సికింద్రాబాద్ జిల్లా| కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఆయన బెడెన్ పౌవెల్, లేడి బెడెన్ పొవెల్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్కౌట్స్ ఆండ్ గైడ్స్ వాలంటీర్లు నిర్వహించిన కల్చరల్ ప్రొగ్రాం లు అందరిని ఆకట్టుకున్నాయి. తమిళనాడులో తిరిచిరాపల్లి లో జరిగిన డైమండ్ జూబ్లీ జంబోరిలో జిల్లా నుంచి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాలంటర్లీకు ప్రశంసాపత్రాలను అందచేశారు. జిల్లా అద్యక్షులు మాధవరావు, ఏఎస్ఐ సాంబనాయక్, డాక్టర్ గీతా, దక్షిణ రైల్వే పీఆర్ఓ రాజేశ్, జిల్లా ఛీఫ్ కమీషనర్ కేవి దేవ్ ధత్, జిల్లా కార్యదర్శి రమేష్ చందర్, కోశాధికారి రాజశేఖర్ రేడ్డి ఉపాధ్యక్షులు మనోజ్కుమార్, ట్రైనింగ్ కమీషనర్ విజయభాస్కర్, ఆర్గనైజింగ్ కమీషనర్లు గౌరీనాధ్ సంగీతా పాండే. కమీషనర్లు డాక్టర్ ఎంహెచ్ భతేనా. రాజేశ్వరి, విష్ణు ప్రసాద్. పలువురు స్కౌట్ మాస్టర్లు, గైడ్ క్యాప్టెన్లు, స్కౌట్స్, గైడ్స్, రోవర్స్, రేంజర్స్ పాల్గొన్నారు.
–––––––––––
–ఫొటో:
–––––––
More News...
<%- node_title %>
<%- node_title %>
నగల దొంగల ఆచూకి తెలపండి

విద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా పటిష్ట చర్యలు: జగిత్యాల సూపరింటెండ్ ఇంజనీర్ సాలియా నాయక్

బీఆరెస్ పార్టీయే తెలంగాణ కు శ్రీరామ రక్షా

బీసీ సంక్షేమ సంఘం ఎండపల్లి మండల అధ్యక్షునిగా పోలోజు శ్రీనివాస్

దోబీ ఘాట్ కాంపౌండ్ గోడ నిర్మాణానికి భూమి పూజ

పేకాట స్థావరంపై సి సి ఎస్ పోలీసుల దాడులు

ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
.jpg)
అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్
