భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు
భక్తుల కొంగు బంగారం భక్త మార్కండేయ దేవాలయం
నేటి నుంచి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు
గొల్లపల్లి ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని నడి బొడ్డున ఉన్న శ్రీ భక్త మార్కండేయ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆ ఆలయం జిల్లా కేంద్రంలో దివ్య క్షేత్రంగా వెలుగుతుంది. 49వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పద్మశాలి సేవా సంఘం, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముస్తాబు చేశారు. కాగా శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ గాయత్రీ మాత, శ్రీ భక్త మార్కండేయుడు, శ్రీ సీతారామంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ గణపతి స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, కొలువై ఉన్నారు. నిత్యం భక్తులు ఈ ఆలయానికి వస్తూ పూజలు నిర్వహిస్తూ మొక్కలు చెల్లించుకోవడంతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది.
ఆదివారం 09 ఫిబ్రవరి నుంచి 13వ తేదీ వరకు ఆలయంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలను వేద బ్రామ్మణుల మంత్రోచ్ఛారణ మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. మొదటి రోజు ఆదివారం రోజున ఉదయం 9.00 ని'లకు గణపతి, గౌరీ పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కంకణధారణ, ఋత్విక్ వర్ణనం, నవగ్రహ చతుషష్టి యోగిని, వాస్తుక్షేత్రపాలక, లింగతోభద్ర దేవతల స్థాపన, సాయంత్రం నుండి ధ్వజారోహణం, అంకురారోపణ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణతో ప్రారంభమై సోమవారం ఉ"9:00ని"లకు స్థాపిత దేవతారాధన, అగ్ని ప్రతిష్ట, గణపతి హవనం, తీర్థప్రసాద వితరణ, మంగళవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, వేదమాత గాయత్రీ మాతకు పంచామృత అభిషేకం, స్థాపిత దేవత హవనం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది.
సాయంత్రం సామూహిక లలిత సహస్రనామ పారాయణం, డోలోత్సవం, వేద సదస్సు, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ, బుదవారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతలకు రుద్రాభిషేకం, రుద్ర హవనం, మన్యుసూత్ర పారాయణం, పంచసుక్త హవనం, వసంతోత్సవం, మంగళహారతి, మంతపుష్పం, తీర్థప్రసాద వితరణ, గురువారం ఉ" 8:00 లకు స్థాపిత దేవతల పూజ, హవనం, బలిహరణం, పూర్ణాహుతి, అన్నప్రసాద వితరణ, నాకబలి, ధ్వజారోహణం, కుంభోద్వాసన, దేవతాప్రొక్షణం, పల్లకి సేవ, ఏకంతసేవ, మహదాశిర్వచనం, ఆచార్య రుత్విక్ సన్మానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తుందని పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఐదు రోజుల పాటు వేడుకలు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో ప్రధాన అర్చకులు మేడిపెల్లి శ్రీనివాస్ శర్మ పాటు, శ్రీ తిగుళ్ల విష్ణు శర్మ, ఆంజనేయ శర్మ, ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వేడుకలు నిర్వహించనున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
