ఒకరి మృతికి కారణమైన హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు
కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అల్లు teem
ఒకరి మృతికి కారణమైన హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు
- డీసీపీ ఆకాంశ్ యాదవ్
కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అల్లు టీం
హైదారాబాద్ డిసెంబర్ 05:
హీరో అల్లు అర్జున్ పై 105, 118(1)r/w3(5) BNS కింద కేసు నమోదు చేశామన సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంశ్ యాదవ్ తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు యాజమాన్యమే కారణమని,అల్లు అర్జున్ వస్తున్న సమాచారం పోలీసులకు చెప్పలేదనీ ఆయన తెలిపారు.
వ్యక్తిగత భద్రతతో అల్లు అర్జున్ లోపలికి వెళ్లే క్రమంలో ఘటన జరిగింది.రేవతి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.పుష్పా2 యూనిట్, హీరో అల్లు అర్జున్,సంధ్యా థియేటర్ యాజమాన్యం, బన్నీ సెక్యూరిటీ వింగ్ పై కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంశ్ యాదవ్ తెలిపారు.
కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం - అల్లు టీం
సంధ్య ధియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాట పై స్పందించిన అల్లు అర్జున్ టీమ్ ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు.ఈ ఘటనపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్.. నిన్న రాత్రి సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం అని.. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం అని తెలిపింది.