గంజాయితో పట్టుబడిన యువకుడి అరెస్ట్

వివరాలు వెల్లడించిన ఎల్కతుర్తి సీఐ రమేష్

On
గంజాయితో పట్టుబడిన యువకుడి అరెస్ట్

భీమదేవరపల్లి ఆగస్టు 24 (ప్రజామంటలు)  :

మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు అనుమానస్పదంగా కనిపించడంతో పట్టుకున్నారు. ఆ వ్యక్తి దగ్గర సుమారు 6,250 రూ.ల విలువగల 250 గ్రాముల గంజాయితో పాటు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్కతుర్తి సిఐ  రమేశ్ వివరాలు తెలుపుతూ, శుక్రవారం రోజున ముల్కనూర్  ఎస్సై సాయిబాబు తన సిబ్బంది, టాస్క్ ఫర్స్ పోలీస్ సిబ్బంది వాహనాల తనేఖీ చేస్తుండగా ఒక వ్యక్తి నీ అనుమానం వచ్చి పట్టుకోని విచారించారు. హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన మాట్ల దిలీప్ 2022 నుండి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా నాగపూర్ నుండి గంజాయి తెచ్చుకుని తాగడం, తనకి డబ్బులు అవసరం ఉన్నపుడు గంజాయి అమ్ముతున్నాడు. ఈ క్రమంలో నా దగ్గర ఉన్న గంజాయిని ఎవరికైనా అమ్ముదామని అనుకున్నాడు. కొత్తపల్లి గ్రామశివారులో ఉన్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తి పై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరు పరిచినట్లు తెలియజేశారు.

గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ముల్కనూర్ సబ్ ఇన్స్ స్పెక్టర్ సాయిబాబు , హెడ్ కానిస్టేబుళ్ళు నాగేశ్వర రావ్ , కానిస్టేబుల్ తిరుపతి, మోహన్ బాబు, వెంకటేశ్వర్లు, శోభన్ బాబు, శివరాజు, రాజు, సదానందంలను సి ఐ అభినందించారు.

Tags