జీహెచ్ఎంసీ స్పందించకపోతే తామే శ్రమదానం చేస్తామని హెచ్చరించిన కేటీఆర్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 16 జూలై (ప్రజా మంటలు) :
ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించే విషయంలో జీహెచ్ఎంసీ ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నించారు.
తమ కాలనీలో చెట్లు భారీగా పెరిగిపోవటం, చెత్త చెదారం కారణంగా పాముల బెడద ఉందంటూ జీహెచ్ఎంసీ మేయర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
తమ కాలనీలో 50 కుటుంబాలున్నాయని మాకు సరైన రోడ్లు, నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి అయితే చాలు దొంగతనాలు జరుగుతున్నాయని కేటీఆర్ కు వివరించాడు.
ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు.
ఆ నెటిజన్ ఫిర్యాదు పై స్పందించి సమస్య పరిష్కరించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని కోరారు.
గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ సమస్య ఉన్న సరే ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను పరిష్కరించేవాళ్లమని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టటంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు.
ఇకనైనా ప్రజా సమస్యలపై మేయర్ సహా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.లేదంటే 48 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే స్థానికులతో కలిసి తామే శ్రమ దానం చేసుకోని సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
