ఆర్డీవో ఆఫీస్, జిల్లా ఆఫీసర్స్ క్వాటర్స్, కలెక్టరేట్ పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

On
ఆర్డీవో ఆఫీస్, జిల్లా ఆఫీసర్స్ క్వాటర్స్, కలెక్టరేట్ పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఆర్డీవో ఆఫీస్, జిల్లా ఆఫీసర్స్ క్వాటర్స్, కలెక్టరేట్ పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జూన్ 27 (ప్రజా మంటలు)

 గురువారం రోజున ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో ఉన్నడిస్ట్రిక్ ఆఫీసర్ క్వార్టర్స్ ను, కలెక్టరేట్ పరిసరాలను, ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం ఒకేసారి ఎంతమంది ఉండవచ్చు, ఎన్ని రూమ్స్  ఉన్నాయి, ఎంత స్థలంలో ఇది నిర్మించడం జరిగిందని, చుట్టూ పక్కల ఏమేమి ఉన్నాయని ఆర్ అండ్ బి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బయట నుండి ఎవరు రావడానికి వీలు లేకుండా ప్రహారీ గోడను నిర్మించాలని, సిసి రోడ్లు అవసరమైతే మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

కలెక్టరేట్ సముదాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ లో కారు మరియు ఇతర వాహనాలను నిలుపుటకు  పార్కింగ్ స్థలంలో షెడ్ ఏర్పాటు చేసే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ ఏ. ఓ. కు సూచించారు. ఎండకు గానీ, వర్షానికి గానీ వాహనాలు తడిసి పాడవకుండా ఉండటానికి నాణ్యమైన షెడ్లను నిర్మించాలని, సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. 

జగిత్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇన్ వార్డ్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే భూసేకరణకు సంబంధించిన రిజిస్టర్లను, ఫైళ్లను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. భూసేకరణకు సంబంధించిన పనులు ఏ దశలో ఉన్నాయి, జాతీయ రహదారికి సంబంధించిన పూర్తి విషయాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, రోడ్లు, భవనాల శాఖ అధికారి శ్రీనివాస్,  వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags