జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు వచ్చేవరకు వెన్నంటే ఉంటా. - నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఆగస్ట్ 14( ప్రజా మంటలు) :
జగిత్యాల జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు పొందే వరకు వారి వెన్నంటే ఉంటానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత 12 రోజులుగా నిరవదిక నిరసన దీక్ష చేపట్టిన జర్నలిస్టులు బుధవారం దీక్షా స్థలంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి తమ నిరసనను తెలిపారు.
దీక్షకు విచ్చేసి సంఘీభావం తెలిపిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.....
తాను రాజకీయల్లోకి వచ్చిన నాటి నుండి ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల డిమాండ్ వినిపిస్తుందన్నారు.
జర్నలిస్టులు కొత్తగా అడిగింది ఎం లేదని గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులకు హామీ ఇచ్చిందన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేరకుండా కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని తెలిసిందని ఈ పద్ధతి మానుకోవాలని హితవు పలికారు.
జర్నలిస్టుల న్యాయమైన కోరిక తీరేవరకు తాను వెన్నంటే ఉంటానన్నారు.
వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు ఇచ్చే రాయితీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని ఎంపీ కి వినతిపత్రం అందజేశారు.
ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కృష్ణ హరి బీజేపీ సీనియర్ నాయకులు చిలుకమర్రి మదన్ మోహన్ దశరథ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.