వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు
(రామ కిష్టయ్య సంగన భట్ల)
సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన
ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన పౌరోహితులు పురుషోత్తమా చార్య, ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ ఆచార్యత్వంలో మద్యాహ్నం 3 గంటలకు ముందుగా వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో దేవస్థానం ముందు భాగాన, సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంచిన మూడు రథాలపై శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర స్వాములను ఆసీనుల గావించి బలిహరణం, అష్టదిక్పాలకుల పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పరచిన క్యూలైన్ల ద్వారా అశేష భక్తులు, రథాలపైకి నిచ్చెనల ద్వారా వెళ్ళి రథా రూఢులైన స్థానిక దైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదమంత్ర ఘోషలు, మంగళ వాద్యాలు, జయజయ ధ్వనాల మధ్య దేవ స్థానంనుండి ఇసుకస్థంభం మీదుగా పురపాలక సంఘ కూడలి వద్ద గల నంది విగ్రహం వరకు నారసింహ, వేంకటేశ్వర, రామలింగేశ్వర రథాలను వరుసగా నిలిపి భక్తజనం అనుసరించగా, రథాలను ఊరేగించగా ముత్తయిదువులు రోడుకిరు వైపులా నిలిచి మంగళ హారతులు పట్టారు.
స్థానిక ప్రముఖులతో కలిసి రథారూడు లయిన స్వామి దర్శనం చేసుకొని కంకణాలు కట్టు కున్నారు. సిఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్,
ఈఓ శ్రీనివాస్, చైర్మన్ రవీందర్, సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్, అసిస్టెంట్ శ్రీనివాస్ రథాల ముందుండిమార్గ నిర్దేశనం చేయగా నంది విగ్రహ కూడలి వద్దకు అశేష భక్త జనం తోడురాగా వూరేగి తిరిగి వచ్చారు.
అనంతరం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలొనరించి గోదావరికి ఊరేగింపుగా వెళ్ళి చక్రతీర్ధ మంగళ స్నానాలు ఆచరించారు. చక్రతీర్ధం అనంతరం రాత్రి మధ్వా చారి రాం కిషన్ గృహంలో
విందు భోజనం ఆరగించి, తిరిగి దేవస్థానానికి చేరుకున్నారు. ధర్మపురి సి ఐ
రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ ఉదయ్ కుమార్, అధిక సంఖ్యలో పోలీసులు, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
