విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా ధర్మ పరిరక్షకుడు చత్రపతి శివాజీ జయంతి వేడుకలు
జగిత్యాల ఫిబ్రవరి 19 ప్రజా మంటలు)
విదేశీయ, విదర్మీయ పాలనను అంతమొందించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాటం చేసిన యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ అన్నారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో ధర్మ ధ్వజానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీత విద్యాలయం వద్దకు చేరుకొని ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి, శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో నివాళులర్పించారు. ఈసందర్భంగా చిట్ల గంగాధర్ మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన మొగల్ సామ్రాజ్యాన్ని, ఆదిల్ షాహి, రాజ్యాన్ని ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీర యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు.
అతి సామాన్య కుటుంబంలో జన్మించిన శివాజీ తోటి గిరిజనులైన మావళీలలో దేశభక్తిని, స్వరాజ్య భావనను నింపి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సైన్యంగా తీర్చిదిద్దిన వ్యక్తి శివాజీ అన్నారు.
పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం, పరిపాలన దక్షత, యుద్ధ నైపుణ్యం వంటి గుణాలలో శివాజీకి సాటి ఎవరూ లేరని అన్నారు. శివాజీ స్ఫూర్తిని చాటి చెప్పడం కోసం ప్రతి సంవత్సరం శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
