గాంధీ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంఈ
గాంధీ ఉస్మానియా,కాకతీయ మెడికల్ కాలేజీల పూర్వ వైభవానికి కృషి చెలని సూచన
సికింద్రాబాద్ మార్చి 07 (ప్రజామంటలు):
గాంధీ ఆసుపత్రిని శుక్రవారం స్టేట్ డైరేక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)డా.నరేంద్రకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్బంగా క్యాజువాలిటీ, ఓపీ వార్డు, రేడియాలజీ తదితర డిపార్ట్ మెంట్ వార్డులను సందర్శించారు. ఆసుపత్రి ఆవరణలో మురికి నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎండలు ముదురుతున్న నేపద్యంలో గాంధీ సందర్శకులకు తాగునీటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో ఎలాంటి పారిశుద్ద్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. అనంతరం డీఎంఈ మాట్లాడుతూ..రాష్ర్టంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, వీటి బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా, పూర్వ వైభవం తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ర్టంలో మొత్తం 15 మేజర్ ప్రభుత్వ ఆసుపత్రులున్నాయని, వీటిల్లో కనీస మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇన్ఫ్రాస్ర్టక్చర్, హ్యుమన్ రిసోర్స్, డయాగ్నసిస్ మూడు ప్రధాన వింగ్ లని అన్నారు. డ్రగ్స్, డైట్, తదితర విభాగాలను బలోపేతం చేయడంపై దృష్టి పెడతామన్నారు. గాంధీ లోని పలు విభాగాలు, కారిడర్ లల్లో వెలుతురు సరిగా లేక చీకటిగా ఉందని గమనించిన డీఎంఈ ఆయా ప్రాంతాల్లో లైట్లు భిగించాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం డాక్టర్ల అటెండెన్స్ ను బయోమెట్రిక్ పద్దతిలో తీసుకుంటున్నామని, సీసీ కెమారాల పర్యవేక్షణ కూడ ఉంటుందన్నారు. బయోమెట్రిక్ సిస్టమ్ ఢిల్లీలోని ఎన్ఎంసీ కి అనుసంధానం చేసి ఉంటుందన్నారు.
డాక్టర్ల హాజరు తగ్గిపోతే ఎన్ఎంసీ పెనాల్టీ వేస్తుందన్నారు. గాంధీలో ఐవీఎఫ్ ప్రాసెస్ లో ఉందని, ప్రస్తుతం ఐయూఐ పద్దతిన సంతాన సాఫల్య కేంద్రం సేవలు అందిస్తున్నామన్నరు.. జీరియాట్రిక్ వార్డు నడుస్తుందని, ఇందులో నాలుగు పీజీ సీట్లు కూడ వచ్చాయని, వారు అడ్మిట్ కూడ అయ్యారని తెలిపారు. ఇటీవల హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఆకస్మిక తనిఖీలో పలువురు డాక్టర్లు గైర్హాజర్ అయినట్లు తేలగా, 27 మంది డాక్టర్లను గుర్తించామని, ఇందులో సమాచారం ఇవ్వకుండా గైర్హాజర్ అయిన 15 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే.ఇందిరా, సూపరింటెండెంట్ డా.రాజకుమారి, ఆర్ఎంవో–1 డా.శేషాద్రి, ఆర్ఎంవోలు యోగేందర్, కళ్యాణ చక్రవర్తి, ఎంపీహెచ్ఈవో వేణుగోపాల్ గౌడ్, హెల్త్ ఆండ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
