గల్ఫ్‌ లో పెంచిన ఇండియన్ పాస్‌పోర్ట్ ఫీజును తగ్గించాలి

On
గల్ఫ్‌ లో పెంచిన ఇండియన్ పాస్‌పోర్ట్ ఫీజును తగ్గించాలి

 పేద గల్ఫ్ కార్మికులపై నాలుగు రెట్ల ఫీజుల భారం

(రామ కిష్టయ్య సంగన భట్ల...9440595494)

కేంద్ర ప్రభుత్వం కొత్త అవుట్‌సోర్సింగ్ విధానంతో గల్ఫ్‌ దేశాలలో పాస్ పోర్ట్, కాన్సులర్ సేవలను ప్రైవేటీకరించి నాలుగు రెట్ల ఫీజులు పెంచడం పట్ల ప్రవాసి కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెంచిన పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజులను వెంటనే తగ్గించాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు సోమవారం మెయిల్ ద్వారా, 'ఎక్స్' వేదిక ద్వారా విజ్ఞప్తి చేశారు. 

విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. ప్రవాస భారతీయులు 2024లో 129 బిలియన్ యుఎస్ డాలర్ల (11 లక్షల 22 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కు పంపారు. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. 

ఇందులో సగానికి పైగా సొమ్ము యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమాన్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాల నుంచే వచ్చింది. ప్రవాసి కార్మికులు దేశానికి ఆర్థిక జవాన్లుగా నిలుస్తున్నారు. గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 

ఏటా 26.6 బిలియన్ యూఎస్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న బంగ్లాదేశ్ ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది. విదేశాల నుంచి ఫారెక్స్ పంపిస్తున్న తమ ప్రవాసీలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం 2.5 శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. మనకంటే చాలా చిన్న దేశం బాంగ్లాదేశ్ తమ ప్రవాసులకు ప్రోత్సాహాకాలు ఇస్తుంటే భారత్ మాత్రం ఎన్నారైలను పీడిస్తున్నదని  భీంరెడ్డి అన్నారు. 

ఇప్పటికే తక్కువ వేతనాలు, జీతం దొంగతనం (వేజ్ థెఫ్ట్), రుణ బానిసత్వం, బలవంతపు శ్రమ, పెరుగుతున్న జీవన వ్యయంతో  ఇబ్బంది పడుతున్న కార్మికులకు పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజుల పెంపు మరింత అన్యాయం చేస్తుంది. ప్రవాసి కార్మికులు తమ ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసినందుకు వారికి భారత ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని మంద భీంరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవాసి కార్మికులకు సహాయం చేయడానికి బదులుగా, వారిని ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ కంపెనీలకు ఆదాయ వనరులుగా మారుస్తున్నారని ఆయన విమర్శించారు.  

గల్ఫ్ దేశాలలో ఇండియన్ పాస్ పోర్ట్, కాన్సులర్ సేవల ఫీజు పెంపు ఈ విధంగా ఉన్నది. సౌదీ అరేబియా లో  200-300 రియాళ్లు (గతంలో 50-75), యూఏఈ లో 200-350 దిర్హములు (గతంలో 50-100), ఓమాన్ లో 25-35 రియాళ్లు (గతంలో 5-10), బహరేన్ లో  20-30 దీనార్లు (గతంలో 5-10), ఖతార్ లో 150-200 రియాళ్లు,  కువైట్ లో 23.750 దీనార్లు వసూలు చేస్తున్నారు. 

గల్ఫ్ కార్మికుల జీవితాలపై ప్రభావం చూపే ఇంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను, వలస కార్మికుల హక్కుల సంఘాలను, పౌర సమాజ సంస్థలను, వలస కార్మికులను ఎందుకు సంప్రదించలేదు. పారదర్శకత, వాటాదారుల ప్రమేయం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని భీంరెడ్డి డిమాండ్ చేశారు.

Tags

More News...

Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...
Local News 

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.

జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు జగిత్యాల జిల్లా అర్ టి ఏ మెంబర్.    జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో  రవాణా శాఖ కార్యాలయము నిర్మాణమునకు అనువైన ప్రభుత్వ స్థలము కేటాయించగలరని కోరుతూ, కార్యాలయ సిబ్బందికి విధి నిర్వహణలో ఏర్పడుతున్న ఇబ్బందులు తదితర సమస్యల పరిష్కార నిమిత్తం జగిత్యాల జిల్లా కేంద్రంలో  10 ఎకరాలు (ఏ టి ఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ ఫిట్నెస్ స్టేషన్, సైంటిఫిక్ డ్రైవింగ్...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం              జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  యశోద  హైటెక్ సిటీ సూపర్ స్పెషాలిటీ   డాక్టర్స్ హరీష్, కీర్తి, చైతన్య లచే సుమారు 250 మందికి పైగా ఉచితంగా వైద్య సేవలు అందించి అవసరమైన వారికి ఉచిత ఫిజియోథెరపీ మరియు రాయితీ లో అవసరమైన   స్కానింగ్లు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్,...
Read More...
Local News 

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం          

జగిత్యాల పట్టణ ఆవోపా  ఆధ్వర్యంలో  యశోద హాస్పిటల్స్ వారిచే ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం                జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)  ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పబ్బ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోటూరి శ్రీనివాస్, కోశాధికారి వూటూరి నవీన్, అదనపు కార్యదర్శి పల్లెర్ల నరేష్    ఎలిమిల్ల సాగర్, కట్కూరి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

భయం వీడితే...జయం మనదే..

భయం వీడితే...జయం మనదే.. - టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు సైకాలజిస్ట్ జ్యోతి రాజా సూచన  సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): బన్సీలాల్ పేట్ లోని చాచా నెహ్రూ నగర్ కమ్యూనిటీ హాల్లో రెయిన్ బో ఫౌండేషన్ ఇండియా, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రెయిన్ బో కమ్యూనిటీ కేర్, లెర్నింగ్ సెంటర్, ఆశ్రిత, బ్లూ ఫౌండేషన్, భవిత ఫౌండేషన్, పీపుల్స్ హెల్పింగ్ చిల్డ్రన్...
Read More...
Local News  State News 

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి

మూలాలకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నాం - జీ. చిన్నారెడ్డి సీఎం ప్రజావాణి సక్సెస్ రేటు 66 శాతం  సీఎం ప్రజావాణి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డి- పాల్గొన్న హైడ్రా కమీషనర్ రంగనాధ్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్య  ## ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లో  "" సిటిజన్ సెంట్రిక్...
Read More...
Local News  State News 

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు

ధర్మపురిలో కోర మీసాలు ... తల నీలాలు .....  కోడె మెక్కులు తీర్చుకున్న భక్తులు (రామ కిష్టయ్య సంగన భట్ల) శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా రాష్ట్రంలో పేరెన్నికగన్న హరిహర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో బుధ వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనరసింహ (యోగ, ఉగ్రుణ శ్రీ వేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా,  యోగానంద, ఉగ్ర లక్ష్మీనారసింహ, వేంకటేశ్వర స్వాముల వార్షిక బ్రహ్మోత్సవాలను  పురస్కరించుకుని...
Read More...
Local News 

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు* భీమదేవరపల్లి మార్చి 12 (ప్రజామంటలు) హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండల కేంద్రంలో JSR గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించడం జరిగింది. వరుసగా నాల్గవ సంవత్సరం ఏర్పాటు చేసిన చలి వేంద్ర కేంద్రాన్ని బీజేపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బాటసారులు,ప్రజలు,ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు...
Read More...
Local News 

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ. గొల్లపల్లి / మల్యాలమార్చి 11 (ప్రజా మంటలు): మల్యాలలో అస్మా సుల్తానా నిన్న రాత్రి తన ఇంటి కి తాళాలు వేసి వారి బిడ్డ ఇంటికి జగిత్యాల కు వెళ్లి తిరిగి ఈరోజు ఉదయం ఇంటికి వచ్చి చూడగా తన ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి, ఇంట్లోని బీరువాలో గల 5 తులాల బంగారు ఆభరణాలు,...
Read More...
Local News 

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం

శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్​ లో చోరికి యత్నం     అగంతకున్ని పట్టుకొని దేహశుద్ది    * అనంతరం పోలీసులకు అప్పగింత సికింద్రాబాద్​, మార్చి 11 (ప్రజామంటలు):పద్మారావునగర్​ శ్రీసాయిబాబా టెంపుల్​ పక్కనున్న శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు చోరికి విఫల యత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయంలోనికి ప్రవేశించిన దాదాపు 50 ఏండ్ల వయస్సు కలిగిన ఓ వర్గానికి...
Read More...
Local News 

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

గురుమూర్తి నగర్‌లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్    సికింద్రాబాద్​, మార్చి 11 ( ప్రజామంటలు):   సంజీవరెడ్డి నగర్ పరిధిలోని గురుమూర్తి నగర్‌లో గల వినాయక స్వామి ఆలయంలో శనివారం రాత్రి దుండగులు పంచలోహ విగ్రహాలను దొంగిలించిన విషయం విదితమే. ఈనేపద్యంలో  ఘటనపై సమాచారం అందుకున్న సనత్‌నగర్ కాంగ్రెస్​ ఇన్‌చార్జ్ డా. కోట నీలిమ వెంటనే స్పందించారు. చోరీకి గురైన విగ్రహాలను త్వరగా గుర్తించి, దొంగలను...
Read More...